చైనా కంపెనీలతో పోటీపడలేక చేతులెత్తేసిన అమెజాన్, ఎక్కడో తెలుసా ?
ఈ కామర్స్ రంగంలో దూసుకుపపోతున్న అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ చైనాలో తన ఈ–కామర్స్ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో సత్తా చాటుతున్న ఆలీబ
ఈ కామర్స్ రంగంలో దూసుకుపపోతున్న అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ చైనాలో తన ఈ–కామర్స్ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో సత్తా చాటుతున్న ఆలీబాబా, జేడీ డాట్ కాం, పిన్‌డ్యూడ్యూ లాంటి సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్ స్థానాన్ని వదులు కోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అక్కడ మార్కెట్ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. మిగతా రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది.

ఈ మూడింటి జోరుతో అమెజాన్ పోటీ పడలేని కారణంగా జూలై 18 నుంచి ఈ–కామర్స్ సేవల విభాగాన్ని నిలిపివేయనుంది. ఇక మిగిలిన సేవలైన వెబ్ సర్వీసెస్, కిండ్లీ ఈ–బుక్స్, క్రాస్ బోర్డర్ ఆపరేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య అమెజాన్ గూగుల్ తో దోస్తీ కట్టింది. అలాగే ఇండియాలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత
టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపి సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి.ఇందులో భాగంగానే గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇకపై అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ యూజర్లు కూడా వీక్షించవచ్చు.

ఇరు సంస్థలు
ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్ టీవీ డివైజ్‌లలో యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ కిడ్స్ యాప్స్ కూడా లభ్యం కానున్నాయి. ఇరు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి.

నాలుగేళ్ల నుంచి
ఎప్పట్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందనేది ఈ కంపెనీలు ఇంకా అధికారికంగా చెప్పలేదు. కాగా ఇరు సంస్థల మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాలకు ఈడీల్ తో ఫుల్‌స్టాప్ పడినట్లయింది. అమెజాన్ సుమారు నాలుగేళ్ల నుంచి గూగుల్‌కి చెందిన క్రోమ్‌క్యాస్ట్ స్ట్రీమింగ్ అడాప్టర్ తమ పోర్టల్‌లో విక్రయించడం నిలిపేసింది.

రూ.35,000 కోట్ల విలువతో..
రూ.35,000 కోట్ల విలువతో, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు అమెజాన్ సర్వం సిద్దం చేసుకుంటోంది.ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రోసరీలతో ఈ కామర్స్‌లో ఇప్పటికే భారీ మార్కెట్‌ను సృష్టించుకున్న విషయం తెలిసిందే.

అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి
కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్‌ను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌లో ఉన్న అవకాశాలను గుర్తించే పనిలో ఉన్నాం. మా కస్టమర్లకు కావాల్సిన ఇన్సూరెన్స్ సొల్యూషన్లపై దృష్టి పెట్టామని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి ప్రకటించడం ఈ న్యూస్ కు మరింత బలాన్ని ఇస్తోంది.


Click it and Unblock the Notifications