‘ప్రెస్‌మీట్’.. టెన్షన్ టెన్షన్?

Posted By: Prashanth

‘ప్రెస్‌మీట్’.. టెన్షన్ టెన్షన్?

 

గొత కొంత కాలంగా స్తబ్థిగా ఉన్నకైండిల్ ఫైర్ టాబ్లెట్ రూపకర్త ‘ఆమోజన్’ సెప్టంబర్ 6న అత్యవసర ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కాలిఫోర్నియాలోని సాంటాక్లారాలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలను సదరు మీడియా సంస్థలకు ఆమోజన్ పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రెస్‌మీట్ వెనుక ఉన్న అంతర్యమేమిటో అర్థంకాని విషయంగా మారి అనేక సందేహాలకు తావిస్తోంది.

గూగుల్ నెక్సస్7తో పోటీపడే విధంగా ఆమోజన్ మరిన్ని అపడేటెడ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన కైండిల్ ఫైర్ 2ను వృద్ధి చేస్తుందని, సెప్టంబర్ 6న నిర్వహించే పాత్రికేయ సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

క్రోమా రిటైల్ స్టోర్‌‍ల ద్వారా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న ‘ఆమోజన్ కైండిల్ ఈ-బుక్’ కీలక ఫీచర్లు:

- 6 అంగుళాల ఈ-ఇంక్ డిస్ ప్లే (రిసల్యూషన్ 600 x 800పిక్సల్స్),

- 1400 ఈ-పుస్తకాలను స్టోర్ చేసుకునే విధంగా 2జీబి ఇంటర్నల్ మెమెరీ,

- వై-ఫై 802.11, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,

- హనీకూంబ్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

- ఇన్ బుల్ట్ ఆమోజన్ సర్వీసెస్, ఆమోజన్ అప్లికేషన్ స్టోర్.

- ధర రూ.6,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot