ప్రైమ్ డే సేల్ సంబరాల్లో అమెజాన్‌కు ఉద్యోగుల భారీ షాక్
అమెరికా రిటైల్ దిగ్గజం అమెజాన్‌కు ఉద్యోగుల నుంచి అమెరికాలో భారీ షాక్ తగిలింది. వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ప్రతిష్టాత్మక ప్రైమ్ డే సేల్‌ను ఇలామొదలుపెట్టిందో లేదో అలా అమెజాన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

అమెరికాలోని Shakopee, Minnesota అలాగే ఇతర అమెజాన్ కంపెనీ ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ విషయాన్ని TechCrunch రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం పని పరిస్థితులు, వేతనాలు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ వేలాది మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా రోడ్డెక్కారు.

పని పరిస్తితులు మెరుగుపర్చాలని
తమ పని పరిస్తితులు మెరుగుపర్చాలని, పర్యావరణ హితంగా పనిచేయాలని, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)తో సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ప‍్లకార్డులను ప్రదర్శించారు. ముఖ్యంగా శాన్ఫ్రాన్సిస్కో , సియాటెల్, మిన్నెసోటాలోని షాకోపీ అమెజాన్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారని టెక్ క్రంచ్ నివేదించింది. అమెరికా సహా యూరోప్‌లోని పలు నగరాల్లో ఉద్యోగుల నిరసన వెల్లువెత్తిందిని రిపోర్ట్ చేసింది. అంతేకాదు పలు నగరాల్లో తమ నిరసన కొనసాగించాలని ప్లాన్ చేశారని తెలిపింది.

సరియైన వేతనాలు లభించడంలేదు
1 ట్రిలియన్ డాలర్లుగా పైగా సంపదతో అలరారుతున్న అమెజాన్‌లోని ఉద్యోగులు తమకు సరియైన వేతనాలు లభించడంలేదనీ, కనీసం బాత్‌రూం విరామం(చాలా తక్కువ) కూడా ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారని న్యూస్‌వీక్ నివేదిక తెలిపింది. అంతేకాదు కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరుతో రెండు లక్షల 70వేల మంది సంతకాలతో ఒక పిటిషన్‌ను అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఇంటికి పంపించనున్నారట.
ఇదిలా ఉంటే ఇండియాలో ఈ-కామర్స్ ప్రముఖ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు పోటాపోటీ సేల్‌తో వినియోగదారుల ముందుకొచ్చాయి. డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ఈ నెల 18 వరకు కొనసాగనుండగా, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి, పాత మొబైల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ తగ్గింపులు ఇవే
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం30ని రూ.13,990కే అమ్మకానికి పెట్టింది. దీని అసలు ధర రూ.16,490. అయితే, ఇది అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులకు మాత్రమే. షియోమి రెడ్‌మి నోట్ 7ఎస్ (3జీబీ/32 జీబీ)ని ఫ్లిప్‌కార్ట్ రూ.9,999కే విక్రయిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.11,999. నోకియా 6.1 ప్లస్ మొబైల్ ఫోన్‌పై అమెజాన్ భారీ తగ్గంపు ఆఫర్ చేస్తోంది. రూ.18,499 విలువైన ఈ ఫోన్‌ను రూ.11,999కే విక్రయిస్తోంది. రియల్‌మి యూ1ను రూ.8,999కి, రెడ్‌మి వై3ని రూ.8,999కి, ఆనర్ వై9ను రూ.11,990కి అందుబాటులో ఉంచింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ తగ్గింపులు ఇవే
ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో రూ.71 వేల విలువైన గూగుల్ పిక్సెల్ 3(64 జీబీ)ని రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. ఆనర్ 8సిని రూ.7,999, ఆనర్ 20ఐని 13,999కి అందుబాటులో ఉంచింది. రియల్‌మి 3 ప్రొను రూ.13,499, మోటొరోలా వన్ పవర్ (4జీబీ/64 జీబీ)ని రూ.10,999కి విక్రయానికి ఉంచింది.


Click it and Unblock the Notifications








