Amazon Wow Salary Days Sale:గొప్ప తగ్గింపు ధరతో అమ్మకానికి టీవీలు, రిఫ్రిజిరేటర్లు
2020 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నేడు కొత్తగా మరొక ఆన్‌లైన్ అమ్మకాన్ని ప్రకటించింది. "అమెజాన్ వావ్ సాలరీ డేస్ సేల్" పేరుతో అందుబాటులోకి వస్తున్న ఈ అమ్మకంలో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, టీవీలు, ఫర్నిచర్ వంటి మరెన్నో వాటిపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తున్నది. ఈ సేల్ సెప్టెంబర్ 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అమెజాన్ వావ్ సాలరీ డేస్ సేల్ బ్యాంక్ ఆఫర్స్
అమెజాన్ వావ్ సాలరీ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కనీసం రూ.7,500 వరకు కొనుగోలు చేసిన లావాదేవీలపై 10% వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుల యొక్క EMI ఎంపికలలో లావాదేవీలు చేసే వినియోగదారులు వరుసగా రూ.1,500 మరియు రూ.2,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

గృహోపకరణాల మీద తగ్గింపు ఆఫర్స్
అమెజాన్ వావ్ సాలరీ డేస్ సేల్ లో పెద్ద గృహోపకరణాలపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ అమ్మకంలో తోషిబా, ఫాక్స్బీ మరియు వైట్-వెస్టింగ్‌హౌస్ వంటి బ్రాండ్ల యొక్క కొత్త వాషింగ్ మెషీన్ లాంచ్‌లు ఉన్నాయి. అలాగే ఎల్‌జీ, శామ్‌సంగ్, వర్ల్‌పూల్ మరియు హెయిర్ వంటి బ్రాండ్ల యొక్క రిఫ్రిజిరేటర్లపై 35% వరకు తగ్గింపును పొందవచ్చు. ఇవే కాకుండా వోల్టాస్, డైకిన్, ఎల్జీ, గోద్రేజ్ వంటి బ్రాండ్ల యొక్క ఎయిర్ కండీషనర్లపై 40% వరకు తగ్గింపును అందిస్తున్నాయి.

కొత్త టీవీల మీద తగ్గింపు ఆఫర్స్
మీరు క్రొత్త టీవీని కొనుగోలు చేయాలనుకుంటే కనుక అమెజాన్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న "అమెజాన్ వావ్ సాలరీ డేస్ సేల్" లో కొన్ని ఆసక్తికరమైన ఒప్పందాలు ఉన్నాయి. కొత్త టీవీల మీద 35% వరకు తగ్గింపు లభిస్తుండగా, ప్రీమియం టీవీల మీద 30% వరకు తగ్గింపు లభిస్తున్నది. అలాగే టీవీలను నో-కాస్ట్ EMI పద్దతిలో నెలకు రూ.1,763 ప్రారంభ ధర చెల్లించి కూడా కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం అందిస్తున్నది.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద తగ్గింపు ఆఫర్లు
బోస్, సోనీ, హర్మాన్ కార్డాన్ సంస్థల యొక్క ప్రీమియం హెడ్ ఫోన్లు మరియు స్పీకర్లను 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఎంపికతో కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం అందిస్తున్నది. ఈ అమ్మకంలో స్పీకర్ల కొనుగోలు మీద 50% వరకు తగ్గింపు ఉంటుంది. రూ.5,000 ప్రారంభ ధరతో లభించే సౌండ్‌బార్లను కూడా జాబితా చేయబడ్డాయి. కెమెరాలు మరియు వాటి యొక్క ఉపకరణాల మీద కూడా 60% వరకు తగ్గింపును పొందవచ్చు.

ల్యాప్‌టాప్‌లు & కంప్యూటర్లపై తగ్గింపు ఆఫర్లు
అమెజాన్ వావ్ సాలరీ డేస్ సేల్ లో కంప్యూటింగ్ పరికరాలు మరియు వాటి యొక్క ఉపకరణాల మీద 50% వరకు తగ్గింపును పొందవచ్చు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు మీద 40% వరకు తగ్గింపు లభిస్తుంది. గేమింగ్ ఎసెన్షియల్స్ మీద 40% వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఇవే కాకుండా స్మార్ట్ వాచీలు, హార్డ్ డ్రైవ్‌లు మరియు SSD కార్డుల కొనుగోలు మీద 40% వరకు తగ్గింపు లభిస్తుంది.


Click it and Unblock the Notifications