అమెజాన్ యూత్ ఆఫర్: 50% డిస్కౌంట్ తో సగం ధరకే ప్రైమ్ మెంబర్‌షిప్...
ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ సమయంలో వినోదం కోసం ఎక్కువ మంది OTT యాప్ ల మీద ఆధారపడుతున్నారు. అందులోను ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ ను పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. అమెజాన్ కూడా ఇప్పుడు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ను కొనుగోలు చేయడం కోసం కొత్తగా యూత్ ఆఫర్‌ను విడుదల చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ వయస్సు 18 మరియు 24 సంవత్సరాల మధ్య ఉంటే కనుక ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల మీద డిస్కౌంట్ ను అందిస్తుంది.భారతదేశంలో "యూత్ ఆఫర్" పేరుతో అందుబాటులో గల ఈ ఆఫర్ 3 నెలల సభ్యత్వం లేదా వార్షిక చందా ప్లాన్ల మీద 50% వరకు డిస్కౌంట్ ను అందిస్తుంది.

అమెజాన్ యూత్ ఆఫర్‌లో భాగంగా 18-24 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ ను పొందటానికి అర్హులు అవుతారు. ఇది డిస్కౌంట్ ఆఫర్ కాదు కేవలం క్యాష్‌బ్యాక్ ఆఫర్ మాత్రమే. ఈ ప్లాన్ యాక్టీవ్ అయిన తర్వాత వినియోగదారులకు ఉచిత డెలివరీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి మరిన్ని ప్రయోజనాలను పొందగలరు.

అమెజాన్ యూత్ ఆఫర్ నిబంధనలు మరియు షరతులు
-అమెజాన్ యూత్ ఆఫర్ 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
- మూడు నెలల సబ్స్క్రిప్షన్ లేదా వార్షిక సభ్యత్వంను కొనుగోలు చేసే చందాదారులకు మాత్రమే అమెజాన్ యొక్క ఈ ఆఫర్ వర్తిస్తుంది.
-ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే ఈ ఆఫర్ ప్రారంభించబడింది. దీని అర్థం iOS లేదా డెస్క్‌టాప్ వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందలేరు.
- ప్రస్తుతానికి అమెజాన్ యొక్క ఈ ఆఫర్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందా లేదా నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితం అని ప్రకటించలేదు.

అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కొత్త ధరల వివరాలు
అమెజాన్ అందించే ఈ కొత్త ఆఫర్ మూడు నెలల ప్లాన్ మరియు వార్షిక ప్లాన్ పై మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండే మరియు 18-24 సంవత్సరాల మధ్య ఉన్న వినియోగదారులు 3 నెలల ప్లాన్ మరియు వార్షిక ప్రణాళికను వరుసగా రూ.164 మరియు 499 రూపాయల తక్కువ ధర వద్ద పొందగలుగుతారు. మిగతా వారందరికీ 3 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర 329 రూపాయలు మరియు వార్షిక ప్లాన్ రూ.999 ధర వద్ద వస్తుంది. అమెజాన్ యొక్క ఈ యూత్ ఆఫర్‌ను ఇతర OS కోసం ఆండ్రాయిడ్ యాప్ మరియు మొబైల్ బ్రౌజర్ వెర్షన్ ద్వారా మాత్రమే రీడీమ్ చేయవచ్చు.

అమెజాన్ ఆఫర్‌ను పొందే విధానం
అమెజాన్ యొక్క కొత్త యూత్ ఆఫర్‌ను పొందడానికి అర్హత ఉన్న వినియోగదారులు 3 నెలల మరియు వార్షిక సభ్యత్వానికి ముందుగా రూ.329 మరియు రూ .999 చెల్లించాలి. వినియోగదారులు తరువాత క్యాష్‌బ్యాక్‌ను తిరిగి పొందుతారు. అయితే వారి యొక్క వయస్సు ధృవీకరణను అప్‌లోడ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని రీడీమ్ చేయవచ్చు. వినియోగదారులు ఒక ఐడి ప్రూఫ్ - ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / ఓటరు ఐడి కార్డ్ / డ్రైవర్ లైసెన్స్ మరియు ఒక సెల్ఫీని అప్‌లోడ్ చేసి వారి వయస్సును ధృవీకరించడం తప్పనిసరి అని ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించింది.

ఐడి ప్రూఫ్ మరియు సెల్ఫీని ధృవీకరించిన తర్వాత వార్షిక సభ్యత్వానికి 500 రూపాయలు మరియు మూడు నెలల సభ్యత్వానికి 165 రూపాయల క్యాష్‌బ్యాక్ 48 గంటల్లో అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంటుకు జమ అవుతుంది. వినియోగదారులు ఆ క్యాష్‌బ్యాక్ మొత్తంతో అమెజాన్ నుండి తమకు కావలసిన దానిని ఏదైనా కొనుగోలు చేయగలరు.


Click it and Unblock the Notifications








