నాడు పుస్తకాలు అమ్మాడు, నేడు ప్రపంచ కుబేరుడయ్యాడు, నివ్వెరపరిచే వాస్తవాలు !
ప్రపంచ అతిపెద్ద రీటైలర్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచాన అపర కుబేరుడిగా నిలిచాడు.
ప్రపంచ అతిపెద్ద రీటైలర్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచాన అపర కుబేరుడిగా నిలిచాడు. ఇప్పటిదాకా ఉన్న ఆ హోదాలో ఉన్న బిల్‌గేట్స్‌ను దాటేసి ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నిలిచాడు. ఆయన సంపద ఇప్పుడు 90.6 బిలియన్ డాలర్లు. కాగా బిల్‌గేట్స్ సంపద 90.1 బిలియన్ డాలర్లు. అయితే ఇది తొలిసారి కాదు గత జూలైలోనూ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం వారెన్ బఫెట్‌ను దాటేసి బెజోస్ ప్రపంచపు రెండో అతిపెద్ద ధనికవంతుడిగా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అతని ఓ ఇంటర్యూలో మాట్లాడిన మాటలు వింటే అందరూ విస్మయానికి గురి కాక తప్పదు.

అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని..
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతికాలంలోనే విస్తరించుకున్న ‘అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం తీరలేదట.

కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే..
వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే నూతన సంవత్సరంలో తన లక్ష్యమని ఆయన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

లక్ష్యం ఇంకా మిగిలే ఉందని..
ఆ ఇంటర్యూలో నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే నాలుగవ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందని చెప్పారు. ఆ లక్ష్యంతోనే నేడు నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు.

పుస్తకాల అమ్మకాలతో..
పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలనే హాలీవుడ్ సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని ప్రకటించిన విషయం తెల్సిందే.

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు..
ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన జీవిత లక్ష్యమని ప్రస్తావించారు.

ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే..
ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించని వ్యక్తి. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల వెయ్యి నుంచి పది వేల డాలర్ల వరకు విరాళాలు ఇస్తున్నారు.

విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో..
అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని నడుపుతుందని ప్రకటించారు.

అమెజాన్ సరఫరా చేస్తున్న ఉత్పత్తుల ప్యాకేజీకి..
అంతటి చిత్తశుద్ధే ఆయనకుంటే అమెజాన్ సరఫరా చేస్తున్న ఉత్పత్తుల ప్యాకేజీకి ఏమాత్రం ప్లాస్టిక్ పేపర్‌ను వాడకూడదు. కాని ఆ దిశగా ఈ అమెజాన్ బాసు అడుగులు పడటం లేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications








