Home
News

అమెజాన్ డే, ఎప్పుడు బుక్ చేసినా ఒక్క రోజులోనే డెలివరీ

ఈ కామర్స్ రంగంతలో దూసుకుపోతున్న అమెజాన్ వినియోగదారుల కోసం మరో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ కి పోటీగా అనేక రకాల ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ దిగ్గజం ససింగిల్ డే డెలివరీ అంటూ దూసుక

ఈ కామర్స్ రంగంతలో దూసుకుపోతున్న అమెజాన్ వినియోగదారుల కోసం మరో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ కి పోటీగా అనేక రకాల ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ దిగ్గజం ససింగిల్ డే డెలివరీ అంటూ దూసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ల కోసం అన్ని డెలివరీలను ఒకరోజు సెట్ చేసుకునే విధంగా సరికొత్త ఆలోచనను తెరమీదకు తెస్తోంది.

అమెజాన్ డే, ఎప్పుడు బుక్ చేసినా ఒక్క రోజులోనే డెలివరీ

వారంలో మీు ఎన్ని ఉత్పత్తులైనా కొనుగోలు చేయవచ్చు. వీటన్నింటిని వారంలో మీరు సెలక్ట్ చేసుకునే రోజున మీ ఇంటికి తీసుకువచ్చి నేరుగా డెలివరీ చేస్తారు. తద్వారా వినియోగదారులకు ఉత్పత్తి లేట్ అయిందన్న టెన్సన్ ఉండదు.

అన్ని ఒకే రోజు

అన్ని ఒకే రోజు

ఇకపై కొనుగోలుదారులు అమెజాన్ లో ఏదైనా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అవి ఓ రోజున ఇంటికి చేరుతాయి. ఉదాహరణకు మీరు శనివారం డెలివరీ పెట్టుకుంటే మిగతా అన్ని రోజులు మీరు ఏం షాపింగ్ చేసినా అవన్నీ ఆ రోజు మీ ఇంటికి వచ్చి చేరుతాయి. మొత్తం గ్రూపు ప్యాకేజీలను ఆ రోజే మీ ఇంటికి ట్రక్ ద్వారా అమెజాన్ చేరుస్తుంది.

తగ్గించుకునే అవకకాశం

తగ్గించుకునే అవకకాశం

అయితే కొనుగోలు దారులు ఒక వేళ ఉత్పత్తులను వద్దనుకుంటే వాటిని తీసివేసుకోవచ్చు. రెండు రోజుల ముందు వస్తువులు తీసివేయడం కాని అలాగే యాడ్ చేయడం కాని చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. ఇప్పటికే ఈ పక్రియ ప్రారంభమైందని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అమెజాన్ డెలివర వైస్ ప్రెసిడెంట్ Maria Renz తెలిపారు.

 

 

భారీ పెట్టుబడులు

భారీ పెట్టుబడులు

కాగా కంపెనీ 2030 నాటికి దాదాపు 50 శాతం net-zero carbon ద్వారా షిప్ మెంట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. కంపెనీ ఈ మధ్యనే దాదాపు 700 మిల్లియన్ డాలర్లు రివియాన్ కంపెనీలో పెట్టుబడులుగా పెట్టింది. ఇందులో భాగంగా electric pickup truckలను 2020 నాటికి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది.

ఆఫర్లు, డిస్కౌంట్లు

ఆఫర్లు, డిస్కౌంట్లు

గత ఏడాది గ్రాసరీస్‌ (కిరాణా,ఆహారోత్పత్తులుఇతరత్రా) వ్యాపారంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఆన్‌లైన్‌ రీటైల్‌ దిగ్గజం అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సూపర్‌ వాల్యూ డే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేల్‌ మార్చి 7వ తేదీవరకు కొనసాగుతుంది.

600 రూపాయల దాకా డిస్కౌంట్‌

600 రూపాయల దాకా డిస్కౌంట్‌

ఎస్‌బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్‌ పే , అమెజాన్‌ డిజిటల్‌వాలెట్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది. ఎస్‌బీఐ కార్డుపై దాదాపు 600 రూపాయల దాకా డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ అవకాశం మార్చి 4-7 తేదీల మధ్య అందుబాటులో ఉంది.

మార్చి 1-3వ తేదీల మధ్య

మార్చి 1-3వ తేదీల మధ్య

మార్చి 1-3వ తేదీల మధ్య ఐసీఐసీఐ కార్డు కొనుగోళ్లపై ఆఫర్స్‌ను అందుకోవచ్చు. రూ. 1500 కొనుగోళ్ళపై ఐసీఐసీఐ కస్టమర్లు 15శాతం దాకా క్యాష్‌బ్యాక్‌ లేదా 600దాకా డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ప్రతీనెల ఒకటవ తేదీనుంచి 7వ తేదీవరకు 40శాతం తగ్గింపు లేదా, 15శాతం క్యాష్‌ బ్యాక్‌ అందివ్వనున్నట్టు వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మరిన్ని వివరాలు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో చూడగలరు.

Best Mobiles in India

English summary
Amazon’s latest program to curb emissions? One delivery day per house, per week
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X