యువ సీఈవోలకు గాలం వేస్తున్న అమెరికా కార్పోరేట్ సంస్దలు

Posted By: Staff

యువ సీఈవోలకు గాలం వేస్తున్న అమెరికా కార్పోరేట్ సంస్దలు

వాషింగ్టన్‌: అమెరికా కార్పేరేట్‌ సంస్థలు మేనేజ్‌ మెంట్‌ పరంగా విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే తమ సంస్థలో పనిచేస్తున్న యువకులనే ముఖ్య కార్యని ర్వాధికారులు (సీఈఓ)గా నియమించటానికి మొగ్గు చూపిస్తున్నట్లు అధ్యయన సంస్థ ఈక్విలర్‌ వెల్లడించింది. 2007, 2009 మధ్యలో సీఈఓలను నియమించిన ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌లో నమోదైన 1500 కంపెనీల్లోని 381పైగా కంపెనీలపై ఈక్విలర్‌ అధ్యయనం చేసింది.

73 శాతం మంది సీఈఓలు అదే సంస్థలో కొంత కాలంగా సంబంధిత విభాగాల్లో పనిచేసిన వారేనని ఈ అధ్యయనం కనుగొంది. కాగా, 28.9 శాతం మంది సీఈఓలు కంపెనీ ఇతర సంస్థలకు చెందిన వారిని నియమించుకున్నారు. మిగతా 2.1 శాతం కంపెనీలు తమ మాజీ సీఈఓలనే మరోసారి అదే పదవిలో నియమించాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting