Amkette నుంచి సరికొత్త హెడ్‌ఫోన్స్
న్యూఢిలీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ కంప్యూటర్ హార్డ్‌వేర్ అలానే ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీ Amkette తన లేటెస్ట్ హెడ్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. Urban headphones పేరుతో ఇవి అందుబాటులో ఉంటాయి. ధర రూ.2,499. పీవీసీ నెక్‌బ్యాండ్‌తో వస్తోన్న ఈ ఇన్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఇతర నెక్‌బ్యాండ్ స్టైల్ హెడ్‌ఫోన్‌లతో పోలిస్తే 60శాతం లైట్ వెయిట్‌ను కలిగి ఉంటాయని కంపెనీ చెబుతోంది.

లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తోన్న ఈ హెడ్‌ఫోన్‌లను రోజంతా అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చట. కంఫర్టబుల్ మ్యూజిక్ లిజనింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాగ్నటిక్ లాక్ వ్యవస్థను ఈ హెడ్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసారు.
ఈ ఇయర్‌ఫోన్‌లను రోజంతా చెవిలో పెట్టుకుని ఉన్నప్పటికి ఎటువంటి ఇబ్బంది కలగదని కంపెనీ చెబుతోంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో భాగంగా వినియోగించే Dupont Kelvar అనే మెటీరియల్‌ను ఈ ఇయర్ ఫోన్ కేబుల్స్ తయారీలో భాగంగా ఉపయోగించినట్లు Amkette వెల్లడించంది.
ఈ హెడ్‌ఫోన్‌లలో పొందుపరిచిన CVC 6.0 నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీ, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌లను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూ హైక్వాలిటీ సౌండ్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ అఫీషియల్
వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం Urban headphonesలో లోడ్ చేసిన 220 mAh బ్యాటరీ యూనిట్ సింగిల్ ఛార్జ్ పై 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుంది. IPX4 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ హెడ్‌ఫోన్‌లను జాగింగ్ సెషన్స్ నిమిత్తం బేషుగ్గా వాడుకోవచ్చు.
వీటి పై చెమడపడినప్పటికి ఏమి కాదు. వైర్‌లెస్ కనెక్టువిటీ సౌకర్యంతో వస్తోన్న ఈ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను బ్లుటూత్ సహాయంతో ఒకేసారి స్మార్ట్‌ఫోన్ అలానే ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications