ఆపిల్ కంపెనీ ఇండియాకి తరలివస్తోంది

Written By:

ఆపిల్ ఈ పేరు జనాల్లో చెప్పలేని క్రేజ్..ఆ కంపెనీ నుంచి ఏ బ్రాండ్ వచ్చినా జనాలు ఆసక్తి కనబరుస్తారు. మొబైల్స్ , మ్యాక్ ఏ ప్రొడక్ట్ అయినా సరే విడుదల కాగానే భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతాయి. ఇండియా, చైనాలో అయితే అమ్మకాలు కళ్లు చెదిరేవిధంగా ఉంటాయి. అయితే చైనాలో ఆపిల్ ప్లాంటు ఉన్నా ఇండియాలో ఇప్పటిదాకా ఆపిల్ ప్లాంట్ లేదు. అయితే ఇప్పుడు ఆ కొరత తీరే దిశగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

జియో యూజర్లకు గుడ్ న్యూస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలను

ఆపిల్ ఇంక్ .భారతలో ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఆపిల్ ఉత్పత్తులను స్థానికంగా ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో ఆపిల్ ఇంక్ .. ఇప్పటికే భారత ప్రభుత్వం చర్చలు సాగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రతిక వెల్లడించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్

ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్ అయిన భారతలో ప్లాంట్ ను నెలకొల్పటం ద్వారా ఇక్కడి మార్కెట్లో మరిం త పట్టును చేజిక్కించుకోవచ్చని ఆపిల్ అంచనా వేస్తోంది.

మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ .. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతమివ్వాలని నిర్ణయించటం కూడా ఆపిల్ను ఆకర్షిస్తోందని తెలిపింది.

పలు మినహాయింపులు

ఇప్పటికే మోదీ సర్కార్ 30 శాతం స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకుని ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న విదేశీ రిటైలర్లకు ఇప్పటికే పలు మినహాయింపులు ఇస్తుండటంతో ఆపిల్ సొంతంగా ప్లాంట్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

నవంబరు నెలలో ప్రభుత్వానికి లేఖ

మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ప్రణాళికలతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలకు సం బంధించి ఆపిల్ ఇంక్ ఇప్పటికే నవంబరు నెలలో ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలిపింది. అయితే ఆపిల్ ఇంక్ ప్రతిపాదనపై ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం స్పందించలేదు.

పూర్తిస్థాయి రిటైల్ స్టోర్లను

భారతలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయటం ద్వారా దేశంలో పూర్తిస్థాయి రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసే అవకాశం ఆపిల్కు లభించనుంది. భారత స్మార్ట్ఫోన్ విక్రయాల్లో ఆపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రస్తుతం రెండు శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
An Apple Manufacturing Plant in India? Don’t Tell Trump read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot