పిన్ ఎంటర్ చేయకుండానే రూ.94 వేలు బయటకు వచ్చేశాయి

By Gizbot Bureau
|

మీరు ఏటీఎం సెంటర్ కి వెళ్లి డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా..అయితే అక్కడ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. కార్డు మిషన్లో పెట్టి పిన్ ఎంటర్ చేస్తే తప్ప డబ్బులు బయటకు రావు. అయితే కార్డు పెట్టిన తరువాత పిన్ ఎంటర్ చేయకుండానే డబ్బులు బయటకు వస్తే..ఓ సారి ఊహించుకోండి.

పిన్ ఎంటర్ చేయకుండానే రూ.94 వేలు బయటకు వచ్చేశాయి

 

అలా సాధ్యం కాదు కాని ఓ సారి డబ్బులు అలా బయటకు వస్తే పండగే కదా..సరిగ్గా ఇలాంటి అనుభవమే ముంబైలోని ఓ మహిళకు ఎదురైంది. ముంబైలోని ఓ ఏటీఎం నుంచి లక్షల నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. ట్రాన్స్ జెక్షన్ చేయకముందే ఏటీఎంలో నుంచి నోట్ల కట్టలను బయటకు కక్కేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే..

 పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండానే

పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండానే

ముంబైలో చార్డెట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న రఫిక్వా మెహదివాలా దగ్గర్లో ఉన్న ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. అక్కడ తన ఏటీఎం కార్డుతో స్వైప్ చేసింది. అయితే ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండానే లక్షల నోట్లు బయటకు వచ్చేశాయి. తాను డ్రా చేసింది కొద్ది మొత్తంలో అయితే దాదాపు రూ.96 వేల వరకు డ్రా అయ్యాయి. అంత డబ్బు బయటకు వచ్చేసరికి సదరు మహిళ షాక్ అయింది.

బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే

బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే

ఆ డబ్బుంతా తన అకౌంట్లో నుంచే విత్ డ్రా అయ్యిందో ఏమోనని బిత్తరపోయింది. మళ్ళీ కార్డు స్వైప్ చేసి తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తన డబ్బు తన అకౌంట్లోనే ఉందని, బయటకు వచ్చిన డబ్బు తనది కాదని తెలిసి ఊపిరి పీల్చుకుంది.

సాంకేతిక సమస్య కారణంగా
 

సాంకేతిక సమస్య కారణంగా

తూర్పు ముంబైలోని అంథేరిలోని ఓ ఏటీఎం దగ్గర ఈ ఘటన జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగిందని ఆరాతీస్తే సాంకేతిక సమస్య కారణంగా ఏటీఎంలో నుంచి ఒక్కసారిగా రూ.96వేల నగదు విత్ డ్రా అయింది. అందులో మొత్తం రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి.

ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు

ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు

ఇలా డబ్బులు బయటకు వచ్చే సమయంలో ఒక్కసారిగా మిషన్ లో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. భయంతో తన ఏటీఎం కార్డును బయటకు లాగేసింది. వెంటనే మరో ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసింది. ఇంతలో ఫస్ట్ ఏటీఎంలో నుంచి రూ.96 వేలు డ్రా అయ్యాయి. ఆ మొత్తాన్ని ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు అప్పగించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
ATM In Mumbai Dispensed Rs 96,000 Before The Account Holder Even Entered Her PIN

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X