పసి ప్రాణాన్ని కాపాడిన ఐఫోన్ (వీడియో)!

Posted By: Prashanth

An iPhone Helped Rescue A Baby From a Well (Video)

 

అవును, ఐఫోన్ ఓ పసి ప్రాణాన్ని కాపాడి ఆ బిడ్డ తల్లిదండ్రుల మనోవేదనను చల్లార్చింది. వివరాల్లోకి వెళితే... మింజీ పట్టణం (చైనా) సమీపంలోని ఓ గ్రామంలో రెండేళ్ల పాప 40 అడుగుల లోతున్న ఇరుకైన గుంతలో ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయింది. రెస్క్యూ టీమ్ అప్రమత్తమైనప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని ప్రయత్నాలు నిరుగారుతున్న సమయంలో రెస్క్యూ బృందంలోని ఓ సభ్యునికి తట్టిన ఐఫోన్ ఐడియా ఆ పసిప్రాయాన్ని పైకి తీసుకువచ్చింది. పాపను రక్షించే ప్లాన్‌లో భాగంగా ఐఫోన్‌ను (కెమెరా ఆప్షన్‌ను ఆన్ చేసి) తాడు సాయంతో పాప చిక్కుకున్న ప్రదేశానికి తీసుకెళ్లగలిగారు. సదరు ఐఫోన్‌‌ను మరో ఫోన్‌కు అనుసంధానించటంతో ప్రమాద తీవ్రతను రెస్క్యూ టీమ్ సమర్థవంతంగా అంచానా వేసి చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. ఆ వీడియోను మీరూ చూడండి......

వీడియ్ లింక్:

రేపటి తరం కంప్యూటర్లు (ఫోటోలు)

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting