అమ్మకానికి సిద్దమైన ఇంటర్నెట్ కంపెనీ యాహు..

Posted By: Staff

అమ్మకానికి సిద్దమైన ఇంటర్నెట్ కంపెనీ యాహు..

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సామ్రజ్యాన్ని విస్తరించిన యాహు కంపెనీ అనూహ్యాంగా సిఈవో క్యారోల్ బర్త్జ్‌కు మంగళవారం ఉద్వాసన పలికిన విషయం అందరికి తెలిసిందే. ఆమె స్దానంలో ప్రస్తుతానికి ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీరర్ తిమోతీ మోర్‌ని తాత్కాలిక సిఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే యాహు కంపెనీ తనని తాను అమ్మకానికి పెట్టనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ఓ అజ్ఞాత వ్యక్తి వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన సమాచారం ప్రకారం మొదట సిఈవో క్యారోల్ బర్త్జ్‌కి ఉద్వాసన పలికి ఆ తర్వాత యాహు కంపెనీ మార్కెట్లో మంచి బిడ్డర్‌ని చూసి అమ్మకానికి పెట్టబోతుందని సమాచారం అందించాడు.

అసలు క్యారోల్ బర్త్జ్ కు ఉద్వాసన పలకడానికి ముఖ్య కారణం రెండు వారాలలో కంపెనీ యొక్క ఆస్తులను మొత్తం లెక్క చూస్తే సిఈవోగా తన జాబ్‌కు న్యాయం చేయడం లేదనే కారణంతో తీసివేయడం జరిగిందని వినికిడి. ఇది గనుక నిజంగా నిజం ఐతే యాహు బోర్డ్ మెంబర్స్‌కి రెండు సంవత్సరాలుగా సిఈవోగా పని చేస్తున్న క్యారోల్ బర్త్జ్ పనితీరు అప్పడు కనిపించలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం యాహు కంపెనీ మీడియా, కంటెంట్, కమ్యూనికేషన్ విభాగాలలో అత్యద్బుంతగా పని చేస్తుంది. అంతేకాకుండా పైన చెప్పిన ఏరియాలలో ఫండ్స్‌ని ఎక్కువగా పెట్టడం జరిగింది.

యాహు బొర్డ్ మెంబర్స్ కూడా యాహుని అమ్మడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా అందరి మన్నననలను పొందిన కంపెనీని ఇలా సడన్‌గా అమ్మకానికి పెట్టడం వల్ల అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot