Smartphoneతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్! మహేష్ బాబు డైరెక్టర్ ని మెప్పించిన నెల్లూరు బుడతలు.
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని నెల్లూరుకు చెందిన చిచ్చర పిడుగులు కొంత మంది నిరూపించారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సెట్టింగులు మీద సెట్టింగులు వేసి సినిమాలను తీసే డైరెక్టరులకు ఝలక్ ఇస్తూ కేవలం ఒకే ఒక స్మార్ట్‌ఫోన్‌తో టాలీవుడ్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

సరిలేరు నీకెవ్వరు యాక్షన్స్ స్పూఫ్
సినిమా హీరోల యొక్క కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను స్పూఫ్ రూపంలో కొంత మంది విడుదల చేస్తూ ఉంటారు. ఆ కోవలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలను కొందరు యువకులు విడుదల చేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.

సరిలేరు నీకెవ్వరు స్పూఫ్ ఫైట్‌లు
దేశం మొత్తం మీద లాక్ డౌన్ అమలులో ఉంటే దానిని ఆసరాగా తీసుకున్న ఈ నెల్లూరు చిచ్చర పిడుగులు ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఇంట్రవెల్ ముందు "బసవా అమ్మోరికి మొక్కినా" అంటూ వచ్చే ఫైట్ ను ఆ సినిమా దర్శకుడే మెచ్చుకునే రీతిలో తీసి పిల్లలు ఇరగదీశారు అంటూ ప్రస్తుతం ప్రశంసల వర్షం అందుకుంటున్నారు. మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఈ చిచ్చర పిడుగులు చేసిన ‘సరిలేరు నీకెవ్వరు' స్పూఫ్ ఫైట్‌లు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నెల్లూరు చిచ్చర పిడుగుల ‘సరిలేరు నీకెవ్వరు’
నెల్లూరు పిల్లలు ఇంతటితో ఆగకుండా అదే సినిమాలో అడవిలో " రమణా లోడ్ ఎత్తాలి రా..చెక్ పోస్ట్ పడతాది" అని సాగే ఫైట్‌ను కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ స్పూఫ్ ఫైట్‌లు ఎంతలా వైరల్ అయ్యాయి అంటే వీరి యొక్క కెమెరా టేకింగ్ మరియు పెర్ఫామెన్స్ చూసి దీన్ని తీసింది పెద్ద డైరెక్టరా అంటూ చాలా మంది కామెంటులు కూడా చేసారు. చివరికి సినిమా డైరెక్టరు అనిల్ రావిపూడి కూడా తన యొక్క ప్రశంసలను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో సరిలేరు నీకెవ్వరు
‘సరిలేరు నీకెవ్వరు' స్పూఫ్ ఫైట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ స్పూఫ్ వీడియోలను డైరెక్ట్ చేసింది నెల్లూరు జిల్లాకు చెందిన కిరణ్ అనే కుర్రాడు. అది కూడా ఒక రూపాయి ఖర్చులేకుండా తనతో పాటు పనిచేస్తున్న వారు మరియు ఊరిలోని చిన్న పిల్లల సాయంతో తన వద్ద ఉన్న రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్ సాయంతో షూటింగ్ చేసాడు.


Click it and Unblock the Notifications








