విద్యార్థులకు Laptop లకు జగన్ సర్కారు ఆమోదం. వివరాలు తెలుసుకోండి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటించింది.వీటిలో ముఖ్యమైనవి 2021 - 24 లకు గాను కొత్త IT చట్టాన్ని తీసుకువచ్చారు. కొత్త IT చట్టం లో భాగంగా విద్య విధానము లో కొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి పేర్ని వెంకట రామయ్య తెలియచేసారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడుతూ 9 -12 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థులకు లాప్ టాప్ లను అందించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అమ్మఒడి scheme లో నగదు కు బదులుగా లాప్ టాప్ లు ఎంచుకునే వారికి లాప్ టాప్ లు అందచేయబడతాయి అని తెలిపారు. లేదా నగదు మాత్రమే కోరుకునే వారికి నగదు అందించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8,21,655 మంది 9 -12 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థులు మరియు 1,10,759 విద్యార్థులు వసతి దీవెన ద్వారా లభ్ది పొందుతున్న వారు నగదుకు బదులు గా laptop లను ఎంచుకున్నట్లు తెలిపారు. లెనోవో ,డెల్,HP మరియు Acer వంటి బ్రాండ్ laptop లను మార్కెట్ ధరలకంటే తక్కువకే అందితున్నట్లు వివరించారు. ఈ laptop లలో డ్యూయల్ ప్రాసెసర్ ,4GB RAM ,500 GB హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్ మరియు 3 సంవత్సరాలు వారంటీ ని అందిస్తున్నట్లు కూడా వివరించారు.

కొత్త విద్యావిధానం
ఈ కొత్త విద్యావిధానం అమలులో మరో ముఖ్యమైన నిర్ణయమైన ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్థాపనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. JNTU -2008 చట్టం ప్రకారం, ప్రకాశం మరియు విజయనగరం జిల్లాల లోని JNTU college లను కలిపి ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీ ని నిర్మిస్తున్నట్లు కూడా తెలిపారు. దీనిలో భాగంగా 24 టీచింగ్ స్టాఫ్ మరియు 17 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

డిజిటల్ లైబ్రరీ
రాష్ట్ర మంత్రి మండలి 2021 - 24 IT పాలసీ కి ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మూడు కాన్సెప్ట్ సిటీ లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన విషయాలను ముఖ్యమైనవి గా భావిస్తున్నట్లు కూడా చెప్పారు.గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీ లను మరియు వాటికి మరియు గ్రామాలకు వేగవంతమైన ఇంటర్నెట్ ను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.ఈ పనులలో భాగంగా IT Emerging Technology Research University ని విశాఖపట్నం లో స్థాపిస్తున్నట్లు కూడా తెలియచేసారు.


Click it and Unblock the Notifications








