ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత వైఫై సేవలు

Posted By:

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఉచిత వైఫై సేవలు

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) దూరప్రాంత ప్రయాణీకులకు వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంద్ర, గురుడ, వెన్నల సర్వీస్ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏప్రిల్ 1 నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సేవలను మొదటి గంట మాత్రమే ఉచితంగా అందిస్తామని ఆ తరువాత ప్రయాణీకుడు రూ.10 చెల్లించినట్లయితే గమ్యస్థానం చేరేంత వరకు వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.

మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, విడతల వారీగా మరిన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులో ఈ సేవను అందుబుటాలోకి తీసుకువస్తామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి ఎదురవుతోన్న పోటీ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Andhra Pradesh : Free Wifi Facility in APSRTC Buses. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot