సంక్రాంతికి ‘మీ కోసం’ ఆన్‌లైన్ గ్రీవెన్స్

Posted By:

సంక్రాతి నాటికి ‘మీ కోసం' పేరుతో ఆన్‌లైన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టంను ఆవిష్కరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రయోగాత్మక ఆన్‌లైన్ గ్రీవెన్స్ మెనేజ్‌మెంట్ సిస్టం అందుబాటులోకి వచ్చినట్లయితే ఖర్చుతో పాటు సమయాన్ని వృథా చేసుకుని ప్రజలు గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి ఫిర్యాదులను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్ద నండే ఆన్‌లైన్ ద్వారా సమస్యల పై ఫిర్యాదు చేయవచ్చు.

సంక్రాంతికి  ‘మీ కోసం’ ఆన్‌లైన్ గ్రీవెన్స్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ప్రజలు తమకు ఎటువంటి సమస్యలు ఉన్నా రాతపూర్వకంగా లేదా ఇతర మార్గాల ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అందుకు సంబంధించి వివరాలను ఆన్‌లైన్ గ్రీవియన్స్ మానిటరింగ్ సిస్టంలో ప్రభుత్వం పొందుపరచనుంది. ప్రజలు పంపే అన్ని దరఖాస్తులు ముందుగా కలేక్టరేట్‌కు వస్తాయి. వాటిని పరిశీలించిన తరువాత కలెక్టర్ వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తారు.

ఈ పద్దతి వల్ల గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు రవాణా ఛార్జీలు భారం అలానే సమయం మరింత ఆదా అవుతుంది. ఫిర్యాదుదారులు ఒకసారి ఫిర్యాదు చేస్తే చాలు సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటే అన్ని సార్లు ఆన్‌లైన్‌‍లో నమోదవుతుంది. తద్వారా సమస్య తీవ్రత గుర్తించి అధికారులు పరిష్కారానికి చొరవ చూపే అవకాశముంటుంది.

English summary
Andhra Pradesh to launch online grievance monitoring system. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot