టూరిజం శాఖ కొత్త ప్లాన్!

Posted By: Super

టూరిజం శాఖ కొత్త ప్లాన్!

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రముఖ ఆన్‌లైన్ సమాచార సంస్థ మోజోస్ట్రీట్‌తో జతకట్టి జీపీఎస్ ఆధారిత మొబైల్ అప్లికేషన్‌ను యాత్రికులకు అందుబాటులోకి తేనుంది. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో పర్యాటకులు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు విహారయాత్రలకు సంబంధించిన స్పెషల్ ప్యాకేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంక్స్ తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తక్కువ కాలవ్యవధిలో మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. జీపీఎస్ టెక్నాలజీ ఆధారితంగా పనిచేసే ఈ అప్లికేషన్ గుగూల్ మ్యాప్స్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా పర్యాటకులు తమ అభిప్రాయాలను ఏపీటీడీసీతో పంచుకోవచ్చు. మోజోస్ట్రీట్ అప్లికేషన్ ప్రస్తుతానికి ఐఫోన్, నోకియా టచ్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. ఔత్సాహికులు ఈ అప్లికేషన్‌ను ప్రముఖ మొబైల్ అప్లికేషన్ స్టోర్‌ల ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గడిచిన ఏడాది రాష్ట్ర పర్యాటక శాఖ కోటియూభై లక్షల మంది పర్యాటకులను ఆకట్టుకోగలిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot