మలేషియాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

Posted By: Super

మలేషియాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

గుంటూరు: ఆంధ్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకతను మలేషియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతన్ని లింగారావుగా గుర్తించారు. అతని స్వస్థలం గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం జంగాలపల్లి గ్రామం. లింగారావు ఆత్మహత్య చేసుకున్నట్లు మలేషియా నుంచి అతని తల్లిదండ్రులకు మంగళవారం ఉదయం ఫోన్ చేసి చెప్పారు. లింగారావు మిత్రులు ఈ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లింగారావు మూడేళ్ల క్రితం మలేషియా వెళ్లాడు. చెన్నైలోని ఓ కంపెనీ తరఫున అతను వెళ్లినట్లు సమాచారం. అతనికి మూడు నెలల క్రితం వివాహమైంది. ఈ నెల 3వ తేదీన అతను స్వస్థలానికి వచ్చి, భార్యను ఇక్కడే వదిలేసి వెళ్లాడు. కుటుంబ కలహాల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కూడా అంటున్నారు. అతని మృతదేహాన్ని దేశానికి తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot