ఆండ్రాయిడ్ 10 వచ్చేస్తోంది, బెస్ట్ ఫీచర్లు ఓ సారి తెలుసుకోండి

టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టంను యూజర్లకు అందిస్తూ వెళుతోంది. మొన్నటికి మొన్న ఆండ్రాయడ్ పై యూజర్లను కనువిందుచేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఇప్పుడు ఆండ్రాయిడ్ 10ని తీసుకొస్తోంది

|

టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టంను యూజర్లకు అందిస్తూ వెళుతోంది. మొన్నటికి మొన్న ఆండ్రాయడ్ పై యూజర్లను కనువిందుచేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఇప్పుడు ఆండ్రాయిడ్ 10ని తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ 10 లేక ఆండ్రాయిడ్ క్యూగా పిలవబడే ఈ ఆపరేటింట్ సిస్టంలో కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. మే 7న జరగబోయే గూగుల్‌ I/Oలో ఆండ్రాయిడ్‌ క్యూ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పేరు ఏంటనే విషయం కూడా చాలామందికి తెలియదు.

ఆండ్రాయిడ్ 10 వచ్చేస్తోంది, బెస్ట్ ఫీచర్లు ఓ సారి తెలుసుకోండి

అయితే దాని ఫీచర్లు ఇవేనంటూ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

డార్క్ మోడ్

డార్క్ మోడ్

ఇప్పటికే చాలా మొబైల్‌ సంస్థలు డార్క్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌, రీడర్‌ మోడ్‌ అంటూ కొన్ని ఫీచర్లను యాప్‌ల వారీగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్‌ కూడా ఈ తరహాలో ఆలోచిస్తోంది. అదే డార్క్‌ స్క్రీన్‌. అయితే దీని ద్వారా ఫోన్‌ మొత్తాన్ని నైట్‌ మోడ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు. కంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

పాత వర్షన్

పాత వర్షన్

ఒక వేళ అప్‌డేట్‌ నచ్చకపోతే తిరిగి పాత వెర్షన్‌లోకి వెళ్లిపోయే విధంగా ఆండ్రాయిడ్‌ ‘క్యూ'లో కొత్త ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. దీని వల్ల మీకు నచ్చినప్పుడు మాత్రమే కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పొరపాటున ఆటో అప్‌డేట్‌ అయిపోయినా మళ్లీ వెనక్కి రావొచ్చు.

యాప్ పర్మిషన్
 

యాప్ పర్మిషన్

మనం వాడుతున్న సేపే పర్మిషన్స్ పనిచేసే విధంగా ఆండ్రాయిడ్ 10 వస్తోంది. మనం వాడకం అయిపోగానే వాటంతట అవే క్లోజ్ అవుతాయి. మళ్లీ కొత్తగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

మొబైల్ నుండి కంప్యూటర్

మొబైల్ నుండి కంప్యూటర్

మొబైల్‌లో ఆడే ఆటలు, వాడే యాప్‌లు కంప్యూటర్‌ తెరపై కనిపిస్తే బాగుంటుంది కదా. ఆండ్రాయిడ్‌ ‘క్యూ'లో ఇలాంటి ఆప్షనే అందుబాటులో ఉంటుందంటున్నారు నిపుణులు. డేటా కేబుల్‌తో కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి ఫోన్‌లో డెస్క్‌టాప్‌ మోడ్‌ ఆప్షన్‌ ఆన్ చేస్తే చాలు.. ఫోన్‌లోని ప్రతి ఆప్షన్‌... కంప్యూటర్‌పై కనబడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను శాంసంగ్‌ తీసుకొచ్చింది.

ఆకారాలు, అక్షరాలు

ఆకారాలు, అక్షరాలు

ఆండ్రాయిడ్‌ ‘క్యూ'లో చాలా రకాల ఐకాన్‌లు ఉంటాయట..! వాటి ద్వారా మనకు నచ్చినట్లుగా ఐకాన్లు, అక్షరాలను మార్చుకోవచ్చు. కొత్త ఆండ్రాయిడ్‌లో రౌండెడ్‌ రెక్టాంగిల్‌, స్క్వేర్‌, సర్కిల్‌, టియర్‌ డ్రాప్‌ లాంటి ఐకాన్లు ఉంటాయి. వాటిలో నుంచి మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.

కాపీ, పేస్ట్ డిలీట్

కాపీ, పేస్ట్ డిలీట్

ఈ ఫీచర్ కొత్తగా రాబోతోంది. దీని ద్వారా మనకు అవసరం ఉన్నంత వరకే ఏదైనా కాపీ చేసినప్పుడు అది ఇంటర్నల్ గా ఉంటుంది. ఆ తర్వాత అది డిలీట్ అయిపోతుంది.

మరింత భద్రత

మరింత భద్రత

మొబైల్స్‌ అన్‌లాక్‌ చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫీచర్‌ ఫింగర్‌ ప్రింట్‌. ఫేస్‌ అన్‌లాక్‌ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంది. అయితే ఇది ఎక్కువగా కస్టమ్‌ రామ్‌ ఫోన్లలో ఉంటూ వస్తోంది. గూగుల్‌ 10.0లో ఈ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్‌గా తీసుకురానుంది. ఇది మీ ముఖాన్ని 360 డిగ్రీల్లో రీడ్‌ చేస్తుంది.

5జి

5జి

గూగూల్ ‘క్యూ'ను 5జీ అనుకూల వెర్షన్‌గా తీర్చిదిద్దారట. దీని ద్వారా మెరుగైన 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని గూగూల్‌ భావిస్తోంది.

కొత్తగా గూగుల్ మ్యాప్స్

కొత్తగా గూగుల్ మ్యాప్స్

గూగుల్‌ మ్యాప్స్‌లో నావిగేషన్‌ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. మ్యాప్‌లో ఐకాన్‌ కదలకపోవడం, ఒక చోట ఉంటే ఇంకో చోట చూపించడం లాంటివి జరుగుతున్నాయి. దీనికి చెక్‌ పెడుతూ గూగుల్‌ ‘క్యూ'లో నాణ్యమైన నావిగేషన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

స్క్రీన్ రికార్డర్

స్క్రీన్ రికార్డర్

గూగూల్‌ ‘క్యూ'లో ఇన్‌బిల్ట్‌గా స్క్రీన్‌ రికార్డర్‌ యాప్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.. ఫుల్‌ స్క్రీన్‌.. మంచి నాణ్యతతో ఈ రికార్డర్ ఉంటుందట. కాగా ఈ ఫీచర్ చైనా కంపెనీ ఫోన్లలో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Android Q (or Android 10): 10 Things to expect in 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X