Android 12 డెవలపర్ ప్రివ్యూ అప్‌డేట్ లోని టాప్ ఫీచర్స్ ఇవే...

|

గూగుల్ ఇప్పటికే తన ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూను గూగుల్ I/O కాన్ఫరెన్స్‌లో ప్రారంభించే ముందు పరీక్ష కోసం అందుబాటులో ఉంచింది. I/O కాన్ఫరెన్స్‌ మే 18 నుంచి 20 మధ్య జరుగుతుందని కంపెనీ ధృవీకరించింది. సంస్థ ప్రకారం Android 12 డెవలపర్ అనేక మార్పులను తీసుకురావడంతో పాటుగా గొప్ప మెరుగుదలలతో వస్తుంది. XDA డెవలపర్‌లకు చెందిన మిషాల్ రెహ్మాన్ విడుదల చేయని ఆండ్రాయిడ్ 12 ను ఉపయోగించుకునే అవకాశం లభించింది. త్వరలో రాబోయే ఆండ్రాయిడ్ 12 గురించి మేము మరింత తెలుసుకున్నాము. ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ అస్థిర వెర్షన్ అని గమనించండి. దీనికి కొన్ని ఫీచర్లు స్థిరమైన పబ్లిక్ వెర్షన్‌లో చేర్చబడకపోవచ్చు. Android 12 డెవలపర్ ప్రివ్యూ యొక్క ముఖ్యమైన ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Android 12 Developer Preview Top 5 Features: Here are The Full Details

Android 12 టాప్ ఫీచర్స్

 

స్క్రోలింగ్ స్క్రీన్ షాట్: XDA నివేదికల ప్రకారం ఆండ్రాయిడ్ 12లో గూగుల్ ఇప్పటికే ఉన్న కొన్ని ఫీచర్లను మరింత మెరుగుపరిచింది. ఇందులో స్క్రోలింగ్ స్క్రీన్షాట్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఇప్పుడు వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా వారు పట్టుకోవాలనుకునే స్క్రీన్ భాగాలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

Android 12 Developer Preview Top 5 Features: Here are The Full Details

పవర్ బటన్ ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ను ఆన్ చేయడం: గూగుల్ అసిస్టెంట్ ట్రిగ్గర్‌ను పవర్ బటన్‌లో చేర్చడానికి గూగుల్ కూడా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా అభివృద్ధి కార్డులు మరియు ఫోన్ నియంత్రణల కోసం కొత్తగా త్వరిత సెట్టింగ్ టైల్ను జోడించింది.

వాల్యూమ్ UI: ఆండ్రాయిడ్ 12 కొత్త వాల్యూమ్ UI మార్పులతో వస్తుంది. ఇది బ్రైట్ స్లయిడర్‌ను కలిగి ఉంటుంది. కొత్తగా రూపొందించిన వాల్యూమ్ స్లయిడర్ మందంగా కనిపిస్తుంది మరియు సిస్టమ్ యొక్క కలర్ కు అనుగుణంగా వస్తుంది.

Android 12 Developer Preview Top 5 Features: Here are The Full Details

ఛార్జింగ్ కోసం కొత్త యానిమేషన్: డెవలపర్లు ఛార్జింగ్ కోసం కొత్త యానిమేషన్‌ను కూడా జోడించారు. మీరు మీ ఫోన్‌ను ఏదైనా ఛార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు డిస్ప్లే యొక్క దిగువ బాగం నుండి పైకి విస్తరించే మరియు ప్రేరేపించే కొత్త అలల యానిమేషన్‌ను చూడవచ్చు.

విడ్జెట్‌లో సెర్చ్ బార్: రాబోయే ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ విడ్జెట్ ఎంపికలో సెర్చ్ బార్‌తో రాబోతోంది. వినియోగదారులు మొత్తం జాబితాను స్క్రోల్ చేయడానికి బదులుగా యాప్ లను శోధించడం మరియు విడ్జెట్‌కు జోడించడం సులభం చేస్తుంది.

Best Mobiles in India

English summary
Android 12 Developer Preview Top 5 Features: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X