Home
News

Android 13 కొత్త అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చే కొత్త ఫీచర్‌ల గురించి మీరు తెలుసుకోవలసినవి

స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్న వారికి అందులో ఉపయోగించే గూగుల్ యొక్క సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ వెర్షన్ గురించి తెలిసే ఉంటుంది. గూగుల్ తన ప్రతి ఆండ్రాయిడ్ అప్‌డేట్‌తో అనేక కొత్త మరియు ఉత్తేజకరమైన ఫీచర్‌లతో పాటుగా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌లు, యానిమేషన్‌లు, థీమ్‌లు వంటి మరిన్ని సాఫ్ట్‌వేర్ మెరుగుదలలను పరిచయం చేస్తుంది. కంపెనీ ఇటీవల తన ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా ఈ స్థిరమైన కొత్త అప్‌డేట్‌ను అందుకోలేదు. కానీ గూగుల్ సంస్థ తన తదుపరి అప్‌డేట్‌ వెర్షన్ ఆండ్రాయిడ్ 13 ని ప్రకటించింది. వాస్తవానికి ఆండ్రాయిడ్ 13 బీటా 1 ఇప్పటికే విడుదల చేయబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Android 13 ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

Android 13 ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

గూగుల్ సంస్థ విడుదల చేసే ప్రతి వెర్షన్‌లో మాదిరిగానే గూగుల్ మొదటగా ఆండ్రాయిడ్ 13 యొక్క డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 13 యొక్క స్థిరమైన సంస్కరణ కంటే ముందు మూడు బీటా వెర్షన్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఆండ్రాయిడ్ 13 యొక్క స్థిరమైన వెర్షన్ 2022 చివరిలో వస్తుందని అంచనా వేయబడింది. మొదటి డెవలపర్ ప్రివ్యూ ఫిబ్రవరిలో విడుదల కాగా మొదటి బీటా వెర్షన్ ఏప్రిల్ 26న పిక్సెల్ ఫోన్లలో విడుదల చేయబడింది.

టైమ్‌లైన్‌

ఒరిజినల్ టైమ్‌లైన్‌ని అనుసరించినట్లయితే కనుక ఆండ్రాయిడ్ 13 యొక్క తదుపరి బీటా వెర్షన్‌ను మే 2022లో విడుదల చేయడాన్ని ఆశించవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ బీటా 3 మరియు 4 కూడా వరుసగా జూన్ మరియు జూలై నెలలో విడుదల చేయబడతాయని కంపెనీ షెడ్యూల్ సూచిస్తోంది. చివరిగా ఆండ్రాయిడ్ 13 యొక్క స్థిరమైన వెర్షన్ ఆగస్టు 2022లో విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.

ఆండ్రాయిడ్ 13 యొక్క ముఖ్యమైన ఫీచర్లు

ఆండ్రాయిడ్ 13 యొక్క ముఖ్యమైన ఫీచర్లు

** ఫోటో పిక్కర్ - ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌లో 'ఫోటో పిక్కర్' ఫీచర్‌ని తీసుకొనిరానున్నది. ఇది ఇతర యాప్‌లతో ఫోటోలు మరియు వీడియోలను సురక్షితంగా షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

** క్విక్ సెట్టింగ్‌ల టైల్ - ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌లో టైల్ ప్లేస్‌మెంట్ APIని పరిచయం చేయనున్నది. దీనితో వినియోగదారులు క్విక్ సెట్టింగ్‌లకు టైల్‌లను కనుగొనడం మరియు జోడించడం సులభం చేస్తుంది.

** పర్-సిస్టమ్ యాప్ - ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌లో అధికమంది ఎదురుచూస్తున్న ఫీచర్‌ని తీసుకువస్తుంది. ఇది ఏ ఇతర యాప్ భాష యొక్క గ్లోబల్ సిస్టమ్ లాంగ్వేజ్‌ను ప్రభావితం చేయకుండా నిర్దిష్ట భాషలో యాప్‌ను ఉపయోగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

 

ఆండ్రాయిడ్ 13

** మీరు డిజైన్ చేసిన మెటీరియల్ - ఆండ్రాయిడ్ 12తో పరిచయం చేయబడిన మెటీరియల్ యు డిజైన్ ఆండ్రాయిడ్ 13తో కంపెనీ మెటీరియల్ యును గూగుల్ యాప్‌ను దాటి అన్ని ఐకాన్‌లకు విస్తరిస్తోంది.

** స్విచ్ స్క్రీన్ రిజల్యూషన్ - ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌తో కొత్తగా గూగుల్ సంస్థ స్క్రీన్ రిజల్యూషన్‌ను మార్చగల సామర్థ్యాన్ని తీసుకువస్తోంది. ఈ ఎంపిక డిస్‌ప్లే సెట్టింగ్‌లలో అందుబాటులో ఉంటుంది.

టాబ్లెట్‌లు, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు క్రోమ్‌బుక్‌ల కోసం ఆప్టిమైజేషన్, స్మార్ట్ హోమ్ కంట్రోల్, MIDI 2.0 సపోర్ట్ వంటి మరిన్ని అనేక ఇతర ఫీచర్‌లను కంపెనీ తన ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌తో పరిచయం చేయనుంది. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 13 కొత్త అప్‌డేట్‌ సామ్ సంగ్, వన్ ప్లస్, పోకో, రియల్ మి మరియు ఇతర బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి తీసుకొని రానున్నది.

 

Best Mobiles in India

English summary
Android 13 New Update Features: You Should Know About Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X