OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. !
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కీలక ప్రకటన చేసింది. తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 5G ఆండ్రాయిడ్ 14 బీటా 1ను సపోర్ట్ చేస్తుందని వెల్లడించింది. కొత్త ఆవిష్కరణల్లో ఇదో కీలక ముందడుగని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ని విడుదల చేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ నిలిచింది.
డెవలపర్ ప్రివ్యూలో ప్రొగ్రంలో భాగంగా వన్‌ప్లస్ 11 5G ఫోన్ వినియోగదారులు ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని తెలిపింది. ఇటీవల జరిగిన గూగుల్ I/O కార్యక్రమంలో ఆండ్రాయిడ్ 14 ఫీచర్లను గూగుల్ ప్రదర్శించిన తర్వాత వన్‌ప్లస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

ఈ అప్‌డేట్ కోసం గూగుల్‌తో పనిచేసిన వన్‌ప్లస్ ఫాస్ట్, స్మూత్, స్థిరమైన OxygenOSను విజయవంతంగా తన ఉత్పత్తులకు ఉపయోగించనుంది. తమ వన్‌ప్లస్ 11 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 బీటా 1ను సపోర్ట్‌చేయడంపై ఆ సంస్థ ప్రెసిడెంట్ మరియు సీవోవో కిండర్ లియు సంతోషం వ్యక్తం చేశారు.
ఆండ్రాయిడ్ యొక్క ఈ తాజా పరిణామం ప్రధానంగా ఐదు థీమ్స్‌పై దృష్టిపెట్టింది. ప్రైవసీ (గోప్యత), సెక్యూరిటీ (భద్రత), పనితీరు, డెవలపర్ ప్రొడక్టివిటీ, యాజర్ కస్టమైజేషన్‌పై దృష్టిసారించింది. వన్‌ప్లస్ 11 5G ఆండ్రాయిడ్ 14 బీటా 1ను సపోర్ట్ చేయనుంది. ఈ అప్‌డేట్ డెవలపర్‌లు, అడ్వాన్స్ యూజర్లకు ఉపయోగపడుతుంది. అయితే ఇందులో చాలా బగ్‌లు ఉన్నాయని తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో మీకు తక్కువ లేదా అస్సలు అనుభవం లేకుంటే ROM ప్లాషింగ్ చేసేందుకు మేము సిఫార్సు చేయడం లేదని వన్‌ప్లస్ వెల్లడించింది. మీ ఫోన్ బ్రికింగ్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒకవేళ మీరు అప్‌డేట్‌ను ప్రయత్నం చేస్తుంటే సూచనలను జాగ్రత్తగా చదవాలని, మీరు ఏం చేస్తున్నరన్నదానిపై పూర్తి స్పష్టత ఉండాలని సూచించింది. ముఖ్యమైన డేటాను ఫ్లాషింగ్ చేసే ముందు బ్యాకప్ చేయాలని సూచించింది.
2023 ఫిబ్రవరిలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 11 5G స్మార్ట్‌ఫోన్.. త్వరగానే ఫ్లాగ్‌షిప్ పనితీరుకి బెంచ్‌మార్క్‌గా మారింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2తో విడుదల అయింది. ఇందులో 16GB LPDDR5x వరకు ర్యామ్ పెంచుకొనే అవకాశం ఉంది. 6.7 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, సూపర్ ప్లూయడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదలైంది. LTPO 3.0 మరియు 100W సూపర్‌వాక్ ఛార్జింగ్‌తో వచ్చింది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mAh.
ఈ ఫోన్ మూడు కెమెరాలతో లాంచ్ అయింది. 50MP ప్రైమరీ కెమెరా. 48MP రెండో కెమెరా, 32MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 16MP కెమెరాను కలిగి ఉంది. 128GB, 256GB వేరియంట్లతో అంగుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








