Home
News

ఆండ్రాయిడ్ 14 టెస్ట్ వెర్షన్ లాంచ్ అయింది! మీరు ఈ ఫోన్లలో టెస్ట్ చేయొచ్చు!

By Maheswara

గూగుల్ ఇటీవల తన లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14 యొక్క మొదటి డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ ను ఆవిష్కరించింది. అప్‌సైడ్‌డౌన్‌కేక్ అని పిలవబడే, ఈ ఆండ్రాయిడ్ 14 OS ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ వెర్షన్ అవుతుంది. మరియు అనేక కొత్త ఫీచర్లు మరియు కొన్ని అప్డేట్ లను ఇది తీసుకువస్తుంది.

Android 14 Developer Preview Revealed, And Available For Google Pixel Smartphones. New Features Details.

గూగుల్ సమాచారం ప్రకారం, ఆండ్రాయిడ్ 14 మార్చిలో మరొక డెవలపర్ ప్రివ్యూను కూడా లాంచ్ చేయడానికి ప్రణాళిక వేస్తోంది. మరియు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బీటా టెస్టింగ్‌లోకి ఈ ప్రవేశిస్తుంది. ఎప్పటిలాగే, తుది విడుదల 2023 చివరి భాగంలో ఉంటుంది. Android 14 డెవలపర్ ప్రివ్యూ 1 వినియోగదారుని ఇంటర్‌ఫేస్‌ను పెద్దగా మార్చనప్పటికీ, డెవలపర్‌లు పరికరం యొక్క పనితీరును మెరుగుపరచడం కోసం అనేక ఫీచర్లు ప్రవేశపెట్టారు.

పెద్ద స్క్రీన్‌లకు సపోర్ట్ చేస్తుంది

ఫోల్డబుల్ ఫోన్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం గూగుల్ చివరకు తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆప్టిమైజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ 12ఎల్‌తో, డెవలపర్లు యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు స్కేలింగ్ పరంగా కొన్ని భారీ పురోగతిని సాధించారు, అయితే ఆండ్రాయిడ్ 14 పెద్ద స్క్రీన్ పరికరాల కోసం మరింత ఆప్టిమైజేషన్‌ను తీసుకువస్తుందని గూగుల్ చెబుతోంది. వివిధ స్క్రీన్ సైజు లలో పనిచేసే యాప్‌లను రూపొందించడానికి డెవలపర్‌లను అనుమతించే క్రాస్ డివైస్ SDK ప్రివ్యూతో మెరుగుపరుస్తున్నట్లు గూగుల్ చెబుతోంది.

Android 14 Developer Preview Revealed, And Available For Google Pixel Smartphones. New Features Details.

మెరుగైన యాక్సెసిబిలిటీ ఫీచర్‌లు

ఆండ్రాయిడ్ 13తో, గూగుల్ ఒక్కో యాప్ లాంగ్వేజ్‌కి సపోర్ట్‌ని పరిచయం చేసింది, అంటే వినియోగదారులు తమ ప్రాధాన్య భాషలో యాప్‌లను ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్ 14 , ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఆండ్రాయిడ్ యొక్క తాజా వెర్షన్ ఫాంట్ పరిమాణాన్ని 200 శాతం వరకు పెంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది అంతకుముందు ఆండ్రాయిడ్ 13లో 130 శాతానికి మాత్రమే పరిమితం చేయబడింది.

బ్యాటరీ జీవితకాలాన్నిపెంచడానికి ఆప్టిమైజేషన్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 14 డాక్యుమెంటేషన్ ప్రకారం, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా వెర్షన్ బ్యాటరీ వినియోగాన్ని మరియు వనరుల వినియోగాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అనే దాని గురించి వివరంగా తెలియజేస్తుంది. కొన్ని కొత్త ఆప్టిమైజేషన్‌లలో ఆండ్రాయిడ్ Wi-Fi ద్వారా డౌన్‌లోడ్‌లను మరియు అవసరం లేని యాప్‌లను పరిమితం చేస్తుంది. వీటిలో డెవలపర్‌లు కొత్త అనుమతి ని జోడించవచ్చు. ఇది ఒక యాప్ సిస్టమ్‌కు నోటిఫికేషన్ లు పంపగలదో లేదో ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది, దీని ఫలితంగా మొత్తం బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది.

Android 14 Developer Preview Revealed, And Available For Google Pixel Smartphones. New Features Details.

కొత్త సెక్యూరిటీ ఫీచర్లు

గూగుల్ ఆండ్రాయిడ్ 14 తో పాత యాప్‌ల సైడ్‌లోడింగ్‌ను కూడా బ్లాక్ చేస్తోంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు 23 కంటే తక్కువ SdkVersionతో ఉన్న యాప్‌లను బ్లాక్ చేస్తుంది, అంటే వినియోగదారులు ఆండ్రాయిడ్ 6 లేదా అంతకంటే పాత వాటి కోసం రూపొందించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు.ఆండ్రాయిడ్ 14 కోడ్ ఇంజెక్షన్‌ను నిరోధించడానికి రీడ్-ఓన్లీ మోడ్‌లో కోడ్‌ను డైనమిక్‌గా లోడ్ చేసే యాప్‌లను కూడా ఉంచుతుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్‌కు హాని కలిగించకుండా సిస్టమ్‌లోని హానికరమైన కోడ్‌ను ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న యాప్‌లను నిరోధిస్తుంది.

ఆండ్రాయిడ్ 14 డెవలపర్ బీటా 1 సపోర్ట్ ఉన్న పరికరాలు

ప్రస్తుతం, అప్‌సైడ్‌డౌన్‌కేక్ అని కూడా పిలువబడే ఈ ఆండ్రాయిడ్ 14 యొక్క మొదటి డెవలపర్ బీటా వెర్షన్ అయిన పిక్సెల్ 4, పిక్సెల్ 4 XL, Pixel 4a, Pixel 5, Pixel 5a, Pixel 6a, Pixel 6, Pixel 6 ప్రో వంటి ఎంపిక చేసిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను మీ కోసం అందుబాటులోకి తెచ్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Android 14 Developer Preview Revealed, And Available For Google Pixel Smartphones. New Features Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X