Home
News

ఆండ్రాయిడ్ 14 లాంచ్ అయింది! ఈ ఫోన్లు వాడుతుంటే అప్డేట్ చేసుకోండి!

By Maheswara

గూగుల్ I/O 2023 ఈవెంట్ రాత్రి ముగిసింది, ఈ ఈవెంట్ లో గూగుల్ పిక్సెల్ ఫోన్లు , టాబ్లెట్ లతో పాటుగా గూగుల్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా వెర్షన్‌ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 14, మొదట బీటా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు పరిమితం కాగా, 2వ బీటా భాగస్వామి ఫోన్‌లు, టాబ్లెట్‌లు మరియు ఫోల్డబుల్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.

ఈ ఆండ్రాయిడ్ 14 యొక్క కొత్త కోర్ ఫీచర్లలో iOS 16 లాంటి లాక్ స్క్రీన్, మెరుగైన కెమెరా ఫీచర్, USB ద్వారా లాస్‌లెస్ ఆడియో మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా మెరుగైన గ్రాఫిక్స్ అనుభవాన్ని అందించడానికి ఆండ్రాయిడ్ 14 ఇప్పుడు GPU యొక్క మెరుగైన ప్రయోజనాన్ని పొందగలదని గూగుల్ ప్రత్యేకంగా హైలైట్ చేసింది.

Android 14 OS Launched In Google I/O 2023 Event. List Of Eligible Smartphones And Steps To Download.

ఇప్పుడు లాంచ్ అయిన, ఆండ్రాయిడ్ 14ని మరింత అభివృద్ధి చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి గూగుల్ సంస్థ iQOO, Lenovo, Nothing, OnePlus, OPPO, Realme, Tecno, vivo మరియు Xiaomiతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ 14 బీటా ప్రోగ్రామ్‌లో Samsung లేదు. ఇది ఒక విధంగా ఆశ్చర్యం కలిగించే విషయమే అయినప్పటికీ ఇటీవల సంఘటనల దృష్ట్యా ఊహించవచ్చు.

ఇటీవల శాంసంగ్ కూడా గూగుల్ డిఫాల్ట్ బ్రౌసర్ కు బదులు Bing బ్రౌసర్ ను వాడాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరు ఈ క్రింది బ్రాండ్‌లలో ఏదైనా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల కొనుగోలు చేసినట్లయితే, మీ పరికరం ఆండ్రాయిడ్ 14 యొక్క ప్రారంభ బీటా బిల్డ్‌ను పొందే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 అప్డేట్ ను పొందగల ఫోన్ల లిస్ట్ ను ఒకసారి గమనించండి.

ఆండ్రాయిడ్ 14 బీటా అప్‌డేట్‌కు అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్
* పిక్సెల్ 4a (5G)
* పిక్సెల్ 5 మరియు పిక్సెల్ 5a
* పిక్సెల్ 6 మరియు పిక్సెల్ 6 ప్రో
* పిక్సెల్ 6a
* పిక్సెల్ 7 మరియు 7 ప్రో
* పిక్సెల్ 7a
* పిక్సెల్ ఫోల్డ్
* పిక్సెల్ ప్యాడ్
* వివో X90 ప్రో
* ఐక్యూ 11
* లెనోవో ట్యాబ్ ఎక్స్ట్రీమ్
* నథింగ్ ఫోన్ (1)
* ఒప్పో ఫైండ్ N2
* ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్
* వన్ ప్లస్ 11
* టెక్నో కామోన్ 20 సిరీస్
* రియల్ మీ GT 2 ప్రో
* షియోమీ 13 ప్రో
* షియోమీ 13
* షియోమీ 12T
* షియోమీ ప్యాడ్ 6

మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 14 బీటా 2 ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
గూగుల్ పిక్సెల్ యూజర్లు ఆండ్రాయిడ్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆండ్రాయిడ్ 14 బీటాకు యాక్సెస్ పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ కాని వినియోగదారులు, సంబంధిత OEM వెబ్‌సైట్ ద్వారా ఆండ్రాయిడ్ 14 బీటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రారంభ ఆండ్రాయిడ్ 14 ROMSలు AOSP (ఆండ్రాయిడ్ ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్) బిల్డ్‌లుగా ఉంటాయి. ఈ పరికరాలలో మనం సాధారణంగా ఇదివరకు సెట్ చేసుకున్న ఆప్టిమైజ్ చేసిన ఫీచర్‌లను కోల్పోతాము.

More from GizBot

Best Mobiles in India

English summary
Android 14 OS Launched In Google I/O 2023 Event. List Of Eligible Smartphones And Steps To Download.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X