Home
News

Android 15 Features ఆండ్రాయిడ్‌ 15 లో క్వారంటైన్‌ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??

గూగుల్‌ I/O 2024 ఈవెంట్‌ త్వరలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆండ్రాయిడ్ 15 (Android 15 Quarantine) ను విడుదల కానుందని భావిస్తున్నారు. దీంతోపాటు అనేక కీలక అప్‌డేట్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 15 బీటా టెస్టింగ్‌ దశలో ఉంది.

ఆండ్రాయిడ్‌ మాల్‌వేర్‌ను అతిపెద్ద సమస్యగా భావిస్తున్న గూగుల్‌.. దీనికి తాత్కాలిక పరిష్కారాలు దొరుకుతున్నా.. పూర్తి స్థాయిలో పరిష్కారం లభించడం లేదని భావిస్తోంది. ఆండ్రాయిడ్ 15 లో ఈ సమస్యకు చెక్‌ పెడుతుందని తెలుస్తోంది. ప్రమాదరకమని భావించే యాప్‌లను క్వారంటైన్‌ చేయవచ్చని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 లో ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు బీటా వెర్షన్ లో గుర్తించారు. ఆండ్రాయిడ్ 15 లోని యాప్‌ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ను గుర్తించవచ్చని తెలుస్తోంది.

android 15 could have an quarantine feature news

గూగుల్‌ ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను కలిగి ఉంది. నోటిఫికేషన్‌లను బ్లాక్‌ చేస్తోంది. అయితే క్వారంటైన్‌ అనేది ప్రస్తుతం ఉన్న వెర్షన్‌కు అప్‌డేట్‌ కావచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ ప్రమాదకర యాప్‌లను వినియోగించకుండా ఈ ఫీచర్‌ పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఏ ప్రాతిపదికన ప్రమాదకర యాప్‌లను విభజన చేస్తుందో ఇంకా వెల్లడి కాలేదు.

అయితే ఈ ఫీచర్‌ సామర్థ్యంలో ఇంకా స్పష్టత లేకున్నా ప్రమాదకర యాప్‌ల గురించి నోటిఫికేషన్‌ రూపంలో తెలియజేసే అవకాశం ఉంటుంది. మరియు క్వారంటైన్‌ లిస్ట్ నుంచి తొలగించేందుకు అనుమతి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 15లో ఇన్‌ బిల్ట్‌గా రానుందని తెలుస్తోంది.

అయితే త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉన్న ఆండ్రాయిడ్‌ 15 లో ఈ క్వారంటైన్‌ ఫీచర్‌ అధికారికంగా కలిగి ఉంటుందో లేదో పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. అయితే త్వరలోనే ఈ ఫీచర్‌ సామర్థ్యం సహా ఇతర వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

*ఈ గూగుల్‌ ఈవెంట్‌లోనే గూగుల్‌ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం విడుదలైన పిక్సల్‌ 7aకు తర్వాత తరం ఫోన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. అప్‌గ్రేడ్‌ చేయబడిన టెన్సార్‌ G3 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ గత నెల US ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (FCC) వెబ్‌సైట్‌లో కనిపించింది. బ్లూటూత్‌ special interest Group (SIG) వెబ్‌సైట్‌లో కనిపించింది.

వెబ్‌సైట్‌లోని వివరాల ఆధారంగా ఈ గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 5.4 బ్లూటూత్‌ కనెక్టివిటిని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. గతంలో వెల్లడైన వివరాల ప్రకారం గూగుల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల పుల్‌ HD+ (1080*2400 పిక్సల్‌) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 1400 నిట్స్‌ HDR బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ టెన్సార్‌ G3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ మరో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రూ.50000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
android 15 could have an quarantine feature to protect from dangerous apps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X