Home
News

వన్‌ప్లస్ ఫీచర్‌ను కాపీ కొట్టిన ఆండ్రాయిడ్ 16.. మల్టీటాస్కింగ్ పనులన్నీ ఇకపై ఈజీ..?

By Ram Kumar

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 16 వచ్చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు బయటకొచ్చాయి. వాటిల్లో మల్టీటాస్కింగ్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒకేసారి రెండు మూడు యాప్స్‌ వాడేవాళ్లకి ఈ కొత్త అప్‌డేట్‌తో చాలా టైమ్‌ సేవ్ కానుంది. ఈ కొత్త అప్‌డేట్‌లో వన్‌ప్లస్ ఫోన్లలో ఉండే సూపర్ కూల్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా కనిపించనుంది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అంతగా బాగోదు. ఒక యాప్ పెద్దగా, ఇంకోటి చిన్నగా కనిపిస్తాయి. చాలాసార్లు చిన్న స్క్రీన్‌లో ఏం జరుగుతుందో సరిగా కనిపించదు. కానీ ఆండ్రాయిడ్ 16లో ఈ బాధలు ఉండవట. ఇందులో ఒక యాప్ స్క్రీన్ దాదాపు 90 శాతం ఆక్రమిస్తే, రెండో యాప్ మిగతా 10 శాతం ప్లేస్‌లో కనిపిస్తుంది. అంటే ఒక యాప్‌ని ఫుల్ స్క్రీన్‌లో చూస్తూనే, రెండో యాప్‌ని కూడా టచ్ చేసేంత దగ్గరగా ఉంచుకోవచ్చు.

Android 16 May Copy OxygenOS

* 90:10 స్ప్లిట్ స్క్రీన్ అంటే ఇదే

కొద్ది రోజుల క్రితం ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూ 2 (DP2) విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో డెవలపర్లు ఈ 90:10 స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్‌కు సంబంధించిన కోడ్‌ను గుర్తించారు. అయితే, ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కానీ కొందరు టెక్ నిపుణులు దీన్ని ఎలాగోలా ఎనేబుల్ చేసి చూశారు.

దీనివల్ల ఒక యాప్ చాలా పెద్దగా కనిపించి, యూజర్లకు మంచి అనుభూతిని ఇస్తుంది. అలాగే రెండో యాప్ కూడా అందుబాటులో ఉండటం వల్ల వెంటనే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు.

* వన్‌ప్లస్ ఓపెన్ కాన్వాస్

వన్‌ప్లస్ కంపెనీ తమ ఫోల్డబుల్ ఫోన్, వన్‌ప్లస్ ఓపెన్‌లో 'ఓపెన్ కాన్వాస్' అనే ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తర్వాత దీన్ని వన్‌ప్లస్ ప్యాడ్ సిరీస్‌లో కూడా పెట్టారు. ఈ ఓపెన్ కాన్వాస్‌లో ఒకేసారి మూడు యాప్‌లను వాడుకోవచ్చు. ఇందులో రెండు యాప్స్‌ స్క్రీన్‍లో 90 శాతం ఆక్రమిస్తాయి. మూడో యాప్ మాత్రం చిన్న విండోలో కనిపిస్తుంది.

ఒక్క ట్యాప్‌తో యాప్‌ల సైజులు మార్చుకోవచ్చు. చిన్న యాప్‌ను పెద్దగా, పెద్ద యాప్‌ను చిన్నగా చేసుకోవచ్చు. కావాలంటే వాటి స్థానాలను కూడా ఇట్టే మార్చేయొచ్చు. ఇప్పుడు దీన్నించే డెవలపర్లు స్ఫూర్తి పొంది కొత్త స్ప్లిట్ స్క్రీన్ సిస్టమ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు.

* ఆండ్రాయిడ్ 16లో ఇంకా ఏమున్నాయంటే...

ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూలో ఇంకొక ఆసక్తికరమైన విషయం కనిపించింది. రెండు యాప్స్‌ స్ప్లిట్ స్క్రీన్‌లో ఉండగా, మూడో యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, అది ఎక్కడ పెట్టాలో మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయట. అంటే గూగుల్, వన్‌ప్లస్ ఓపెన్ కాన్వాస్‌లాగే మూడు యాప్స్‌ను ఒకేసారి వాడే ఫీచర్‌ను తీసుకురావచ్చని అనిపిస్తోంది.

వన్‌ప్లస్ ఫోన్లలో అయితే టాస్క్‌బార్ నుంచి యాప్స్‌ను డ్రాగ్ చేసి విండోల్లోకి తీసుకురావచ్చు. లేదా కొన్ని జెస్చర్‌ల ద్వారా విండోలను రీ-అరేంజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది కానీ, గూగుల్ మాత్రం ఈ ఫీచర్ల నుంచి స్ఫూర్తి పొంది, ఫోన్లు, ట్యాబ్లెట్‌లలో మల్టీటాస్కింగ్‌ను మరింత ఈజీ చేయాలని చూస్తోంది.

* దీని వల్ల యూజర్లకు ఏం లాభం..

ఈ 90:10 స్ప్లిట్ స్క్రీన్ లేదా మూడు యాప్‌ల మల్టీటాస్కింగ్ ఫీచర్ వస్తే ఆండ్రాయిడ్ ఫోన్లు మరింత శక్తివంతంగా తయారవుతాయి. ఒకేసారి నోట్స్ రాసుకుంటూ బ్రౌజ్ చేయడం కానీ, పాటలు వింటూ మెసేజ్‌లు పంపడం కానీ, ట్యాబ్లెట్‌లలో ఒకేసారి చాలా పనులు చేసుకోవడం కానీ చాలా సులువు అవుతుంది.

ఆండ్రాయిడ్ ఇంతకుముందు కూడా ఇతర కంపెనీల మంచి ఫీచర్లను తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో చేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వన్‌ప్లస్ ఫీచర్‌ను కాపీ కొట్టడం ద్వారా యూజర్లకు మంచి అనుభూతిని ఇవ్వాలని చూస్తోంది. ఆండ్రాయిడ్ 16 పబ్లిక్ బీటా త్వరలోనే రాబోతోంది. అప్పుడు ఈ స్ప్లిట్ స్క్రీన్ మార్పులు నిజంగానే వస్తాయో లేదో చూద్దాం. కానీ ప్రస్తుతానికైతే, ఇది మాత్రం నిజంగా అదిరిపోయే అప్‌డేట్ అని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Android 16 May Copy OxygenOS Smarter Multitasking Feature Coming Soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X