ఆండ్రాయిడ్ 16 OS ఏయే స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు చేస్తుంది.. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి?
గూగుల్ అధికారికంగా ఆండ్రాయిడ్ 16 OS ను (Android 16 OS) విడుదల చేసింది. యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించే విధంగా డిజైన్ సహా ఫీచర్‌లున్నాయి. అయితే తొలుత గూగుల్ పిక్సల్ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 16 అందుబాటులోకి వస్తుంది. అనంతరం ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 OS మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ బ్యాటరీ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ వీడియో కోడెక్ సపోర్టును కలిగి ఉంటుంది. క్విక్ సెట్టింగ్స్ తోపాటు లైవ్ అప్‌డేట్స్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు కస్టమైజ్డ్ DND మోడల్ ఆప్షన్ ఉంటుంది.

ఆండ్రాయిడ్ 16 OS లో యూజర్ల అనుభవం, యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా అనేక కొత్త ఫీచర్‌లను తీసుకొచ్చింది. దీంతోపాటు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. దీంతోపాటు ఆన్‌లైన్ బెదిరింపులు, హానికర యాప్స్, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, స్కామ్ కాల్స్ నుంచి ప్రొటెక్షన్ సూట్ మెరుగైన భద్రతను కల్పిస్తుంది.
దీంతోపాటు డెస్క్‌టాప్ తరహా అనుభవం కోసం శాంసంగ్ తో కలిసి పనిచేసింది. శాంసంగ్ డెక్స్ ను ఉపయోగించుకుంది. కంప్యూటర్ తరహాలోనే అనేక యాప్స్‌లు ఓపెన్ చేయడం సహా ఇతర మార్పులను చేయగలుగుతారు. అయితే ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 16 OS గూగుల్ పిక్సల్ ఫోన్‌లతోపాటు శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్, మోటోరోలా, నథింగ్ బ్రాండ్‌లో కొన్ని ఫోన్లకు అందుబాటులోకి రానుంది.
- గూగుల్ పిక్సల్ 6 సిరీస్, పిక్సల్ 7 సిరీస్, పిక్సల్ 8 సిరీస్, పిక్సల్ 9 సిరీస్, పిక్సల్ ఫోల్డ్, పిక్సల్ ట్యాబ్లెట్
- శాంసంగ్ S సిరీస్ : గెలాక్సీ S22, S23, S24, S25
- శాంసంగ్ Z సిరీస్ : గెలాక్సీ Z ఫోల్డ్ 4, 5, 6, Z ఫ్లిప్ 4, 5, 6
- శాంసంగ్ A సిరీస్ : గెలాక్సీ A24, A25, A26, A34, A35, A36, A54, A55, A56, A73
- శాంసంగ్ M సిరీస్ : గెలాక్సీ M34, M35, M54, M55, M56
- శాంసంగ్ F సిరీస్ : గెలాక్సీ F34, F54, F55
- వన్‌ప్లస్ 11, 12, 13
- వన్‌ప్లస్ నార్డ్ 3, నార్డ్ CE 4, నార్డ్ CE 4 లైట్
- షియోమీ 13, 14, 15 సిరీస్
- రెడ్‌మి 12, 13 సిరీస్
- రెడ్‌మి నోట్ 13, 14 సిరీస్
- రెడ్‌మి K70
- మోటోరోలా ఎడ్జ్ 40, ఎడ్జ్ 50, ఎడ్జ్ 60
- మోటోరోలా Razr 50, మోటోరోలా Razr 60
- మోటోరోలా G45, G85
- నథింగ్ ఫోన్ 1
- నథింగ్ ఫోన్ 2
- నథింగ్ ఫోన్ 2a
- నథింగ్ ఫోన్ 3a
- నథింగ్ ఫోన్ 3a ప్రో
ఆండ్రాయిడ్ 16 OS ను అప్‌డేట్ చేసుకొనేందుకు ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అనంతరం సిస్టమ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పైన క్లిక్ చేయాలి. అనంతరం అప్‌డేట్స్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. అప్‌డేట్ సుమారుగా 2GB ఉంటుంది. అప్‌డేట్ లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








