ఆండ్రాయిడ్ 8.0లో బెస్ట్ ఫీచర్..

Written By:

ఆండ్రాయిడ్ 8.0 వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇందులో ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 7.0 కన్నా మెరుగైన ఫీచర్లు ఉన్నాయా అని చాలామందికి సందేహం రావడం సహజం. అయితే ఓరియో సరికొత్త ఫీచర్ తో మీ ముందుకొచ్చింది. అదేంటో మీరే చూడండి.

ఈ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ ఉంచడం చాలా ప్రమాదం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బూట్‌లూపింగ్

ఆండ్రాయిడ్ డివైస్‌లను వాడుతున్న యూజర్లకు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ఒకటి బూట్‌లూపింగ్. కొన్ని సందర్భాల్లో డివైస్ ఆటోమేటిక్‌గా అదే పనిగా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది.

దానంతట అదే స్విచాఫ్

ఫోన్ ఆన్ అవుతుంది, ఆన్ అవ్వగానే మళ్లీ దానంతట అదే స్విచాఫ్ అయ్యి మళ్లీ రీస్టార్ట్ అవుతుంది. ఇదే ప్రక్రియ కొన్ని సార్లు ఆండ్రాయిడ్ డివైస్‌లలో కంటిన్యూ అవుతుంది. ఇది ఎందుకు వస్తుందో తెలియకపోయినా, దీనికి మాత్రం బూట్‌లూపింగ్ అని పేరు పెట్టారు.

ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' లో

ఎవరి డివైస్‌కైనా ఈ సమస్య వస్తే అప్పుడు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిందే. అయితే ఇకపై యూజర్లకు ఈ అవసరం రాదు. ఎందుకంటే తాజాగా విడుదలైన 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' లో 'రెస్క్యూ పార్టీ పేరుతో ఓ పవర్ ఫుల్ ఫీచర్ ను అందించనున్నారు.

రెస్క్యూ పార్టీ ఫీచర్ డివైస్‌లో

ఆండ్రాయిడ్ 8.0లో అందించనున్న రెస్క్యూ పార్టీ ఫీచర్ డివైస్‌లో బూట్ లూపింగ్ సమస్య వస్తే వెంటనే దానంతట అదే డిటెక్ట్ చేసుకుని యాక్టివేట్ అవుతుంది.

5 సార్లు రీస్టార్ట్ అయినా

డివైస్ 5 నిమిషాల్లో వరుసగా 5 సార్లు రీస్టార్ట్ అయినా లేదంటే 30 సెకండ్లలో సిస్టమ్ యాప్ వరుసగా 5 సార్లు క్రాష్ అయినా ఈ రెస్క్యూ పార్టీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.

డివైస్ రికవరీ మోడ్‌లోకి

దీంతో డివైస్ రికవరీ మోడ్‌లోకి వెళ్తుంది. అక్కడ యూజర్ తన ఫోన్‌ను సులభంగా ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నాక డివైస్ రీస్టార్ట్ అయి ఎప్పటిలాగే పనిచేస్తుంది.

దీని కోసం ప్రత్యేకంగా

త్వరలో రానున్న ఆండ్రాయిడ్ 8.0 డివైస్‌లలో ఈ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా రానుంది. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌ను, హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android 8.0 Oreo introduces 'Rescue Party' to prevent smartphone bootloops Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting