ఆండ్రాయిడ్ 9 పై రన్ అయ్యే డివైస్‌లు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ర‌న్ అవుతున్న ఆండ్రాయిడ్ ఓఎస్‌ల‌ను బ‌ట్టి ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ నంబ‌ర్ల‌ను సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తాజాగా విడుద‌ల చేసింది. గూగుల్ మే 2019 నెల‌క

|

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ర‌న్ అవుతున్న ఆండ్రాయిడ్ ఓఎస్‌ల‌ను బ‌ట్టి ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ నంబ‌ర్ల‌ను సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తాజాగా విడుద‌ల చేసింది. గూగుల్ మే 2019 నెల‌కు గాను ఈ డేటాను విడుద‌ల చేసింది. గూగుల్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో 10.4 శాతం డివైస్‌ల‌లో ర‌న్ అవుతున్న‌ది. అలాగే ఆండ్రాయిడ్ ఓరియో 28.3 శాతం డివైస్‌లలో, నౌగ‌ట్ 19.2 శాతం డివైస్‌ల‌లో, మార్ష్‌మల్లో 16.9 శాతం వాటిలో, లాలిపాప్ 14.5 శాతం డివైస్‌ల‌లో, కిట్‌క్యాట్ ఓఎస్ 6.9 శాతం డివైస్‌ల‌లో ర‌న్ అవుతున్న‌ట్లు తెలిపింది. మే 7వ తేదీకి 7 రోజుల ముందు వ‌ర‌కు తాము సేక‌రించిన స‌మాచారాన్ని బ‌ట్టి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించామ‌ని గూగుల్ తెలిపింది.

 
ఆండ్రాయిడ్ 9 పై రన్ అయ్యే డివైస్‌లు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కాగా ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 10.0 క్యూ మ‌రో రెండు నెల‌ల్లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. ఈ సంధర్భంగా ఆండ్రాయిడ్ 9లో కొత్తగా ఏం ఫీచర్లు ఉన్నాయో ఓ సారి చూద్దాం.

స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ లైఫ్‌ను

స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ లైఫ్‌ను

గతేడాది ఆగస్టులో ఆండ్రాయిడ్ 9 పై'ని గూగుల్ అధికారికంగా లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ లైఫ్‌ను ఆండ్రాయిడ్ 9పై బాగా మెరుగుపరుస్తుందని హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వచ్చిన 'అడాప్టీవ్ బ్యాటరీ' ఫీచర్‌ బ్యాటరీని ఆదా చేస్తుందని భావించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

వేగంగా బ్యాటరీ డౌన్

వేగంగా బ్యాటరీ డౌన్

బ్యాటరీని ఆదా చేయడం సంగతి అటుంచితే ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా వేగంగా బ్యాటరీ డౌన్ అయిపోతుందంటుని యూజర్లు ఫిర్యాదులు చేశారు. 'ఆండ్రాయిడ్ 9 పై'కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత చాలామంది యూజర్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందని వెంచర్‌బీట్ కథనాన్ని వెలువరించింది

గూగుల్ ఫోన్లలోనే ఎక్కువ
 

గూగుల్ ఫోన్లలోనే ఎక్కువ

అయితే ఈ రకమైన సమస్య గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఫోన్లలో బ్యాటరీ ఒకరోజు కూడా పూర్తిగా ఉండట్లేదు. గూగుల్ ప్రొడక్ట్ ఫోరమ్ అయిన రెడ్డిట్‌లో ఈ సమస్యపై అనేక మంది ఫిర్యాదు చేశారు.

 ఫోన్ స్విచ్ఛాఫ్

ఫోన్ స్విచ్ఛాఫ్

ఆండ్రాయిడ్ 9 పై లోని అడాప్టీవ్ బ్యాటరీ ఫీచర్ సరిగ్గా పనిచేయట్లేదని అందువల్లే బ్యాటరీ డెడ్ అవుతోందని తెలుస్తోంది ఇప్పటికే 'ఆండ్రాయిడ్ 9 పై' అప్‌డేట్ చేసినవాళ్లు అడాప్టీవ్ బ్యాటరీ ఫీచర్‌ని ఆఫ్ చేసినప్పటికీ బ్యాటరీ ఇంకా వేగంగా ఖాళీ అవుతోందని వెంచర్‌బీట్ పరిశీలనలో తేలింది. 5 శాతం బ్యాటరీ ఉండగానే ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన సందర్భాలున్నాయి.

మీడియా యాప్స్

మీడియా యాప్స్

ఇలా బ్యాటరీ త్వరగా ఖాళీ కావడానికి కారణం మీడియా యాప్స్ అన్న వాదన వినిపిస్తోంది. అవన్నీ పాత ఓఎస్‌కు సపోర్ట్ చేసేవి. కొత్త ఓఎస్‌కు సపోర్ట్ చేసేలా వాటిలో మార్పులు చేస్తేనే సరిగ్గా పనిచేస్తాయి. బ్యాటరీ సమస్యలు రావని గూగుల్ చెబుతోంది. మరిన్ని అప్ డేట్స్ అందిస్తామంటూ తెలిపింది. ఈ లోపే ఆండ్రాయిడ్ క్యూ మార్కెట్లోకి వచ్చేసింది.

Digital Wellbeing features

Digital Wellbeing features

గూగుల్ సంస్థ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ను ఎదుర్కునేందుకు Digital Wellbeing అనే ఫీచర్ ను ఆండ్రాయిడ్ p లో యాడ్ చేసింది.ఈ ఫీచర్ లో డాష్ బోర్డ్ మరియు యాప్ టైమర్ ను కలిగి ఉంటుంది. డాష్ బోర్డ్ వంటి ఫీచర్ ను పొందటానికి Offtime లేదా Forest అనే యాప్స్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ మీరు మొబైల్ తో ఎంత సమయం గడిపారో మీకు తెలియజేస్తుంది. యాప్ టైమర్ వంటి ఫీచర్ ను పొందడానికి App Block or App off timer అనే యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లొడ్ చేసుకోవచ్చు

Best Mobiles in India

English summary
Google reveals that 10 percent of devices are using Android 9 Pie, nine months after its release

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X