అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న 'సౌరభ్ గంగూలీ'

Posted By: Prashanth

అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న 'సౌరభ్ గంగూలీ'

 

కోల్‌కత్తా: ఏప్రిల్ 4 కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న రోజు. ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్లను సక్సెస్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి జరగనున్న సీజన్‌ని కూడా అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఐపిఎల్ ప్రాంచైజీ జట్టు యజమానులు కూడ వారి వంతు ఐపిఎల్‌ను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.

ఐపిఎల్ టి20లో పూణె వారియర్స్ జట్టుకి గురువు-సహితమైన-కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేరున మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చేశారు. ఈ అప్లికేషన్ ద్వారా పూణె వారియర్స్ ఇండియాకు సంబంధించిన న్యూస్‌ని తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఇలా ఒక క్రికెటర్ మీద మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చెయ్యడం ఇదే మొదటి సారి. ఈ అప్లికేషన్ ద్వారా అభిమానులు లేటెస్ట్ న్యూస్, ట్వీట్స్, పిక్చర్స్, వీడియోలతో పాటు పూణె వారియర్స్ ఇండియాకు సంబంధించిన స్కోరు కార్డ్స్‌ని పొందుతారు.

క్యానీశ్రీజల్ వారి సౌజన్యంతో సౌరభ్ గంగూలీ పేరున ఈ అప్లికేషన్‌ని రూపొందించామని ఎస్‌సిగంగూలీడాట్‌కామ్ ప్రతినిధి తెలిపారు. ఈ అప్లికేషన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ 'గూగుల్ ప్లే' నుండి ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఐఫోన్ యూజర్స్‌కు కూడా ఈ అప్లికేషన్‌ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot