ఆండ్రాయిడ్ గూటికి డిస్పోజబుల్ ఫోన్ నెంబర్ అప్లికేషన్ ‘బర్నర్’

Posted By:

డిస్పోజబుల్ ఫోన్ నెంబర్ అప్లికేషన్ ‘బర్నర్'(Burner) ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్ గూగుల్ ప్లేలో లభ్యమవుతోంది. ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ సాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు ఇక పై టెంపరరీ ఫోన్ నెంబర్‌లను ఉపయోగించుకుని కాల్స్ ఇంకా సందేశాలను పంపుకోవచ్చు. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడవల్సి వచ్చిన సందర్భంలో ఇంకా ఐడెంటిటీ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో బర్నర్ అప్లికేషన్ కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ గడిచిన అగష్టు నుంచి యాపిల్ ఐఫోన్‌కు యూజర్‌లకు అందుబాటులో ఉంది. తాజాగా ఆండ్రాయిడ్ డివైజులను సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ గూటికి డిస్పోజబుల్ ఫోన్ నెంబర్ అప్లికేషన్ ‘బర్నర్’

ఈ అప్లికేషన్ ఇన్స్‌స్టాలేషన్‌తో ఒక డిస్పోజబుల్ నెంబర్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ నెంబర్ ఒక రోజు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ వ్యవధిలో 5 కాల్స్‌తో పాటు 15 సందేశాలను పంపుకోవచ్చు. నంబర్ గడువు ముగిసినట్లయితే అదనపు నెంబర్‌ను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఒకే డిస్పోజబుల్ నెంబరును 30 రోజుల పాటు వినియోగించుకునే సదుపాయాన్ని బర్నర్ కల్పిస్తోంది. బర్నర్ అప్లికేషన్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకుందామనుకుంటున్నారా..? క్లిక్ చేయండి: 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot