అత్యధికంగా హ్యాక్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడే’

|

2012-13 మధ్యలో ఆండ్రాయిడ్ మాల్వేర్ 63 శాతానికి పెరిగినట్లు యాంటీ - వైరస్ సాఫ్ట్‌వేర్ ఇంకా ఇంటర్నెట్ ప్రొటెక్షన్‌లను సమకూర్చే ఇఎస్ఇటీ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా హ్యాక్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టం కూడా ‘ఆండ్రాయిడే' అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 2010లో ఆండ్రాయిడ్ ను ఇబ్బంది పెట్టే మాల్వేర్ రకాల సంఖ్య మూడు కుటుంబాలుగా ఉండగా, అక్టోబర్ 2013 నాటికి ఆ సంఖ్య 79గా పెరిగిందని సంస్థ పేర్కొంది.

అత్యధికంగా హ్యాక్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడే’

మరోవైపు కొత్తగా కనుగొన్న 99శాతం మొబైల్ మాలీషియస్ ప్రోగ్రామ్‌లలో 99 శాతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ను టార్గెట్ చేసినవేనని క్యాస్పర్ స్కై సెక్యూరిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌‌ను విశ్లేషించినట్లయితే 80శాతం మార్కెట్‌ను ఆండ్రాయిడ్ శాసిస్తోంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు పెరగిపోయాయి. ప్రమాదకర వైరస్‌ల నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను రక్షించుకునేందుకు పలు చిట్కాలను నేటి శీర్షికలో భాగంగా సూచిస్తున్నాం.

- మీ ఫోన్ స్ర్కీన్‌ను పిన్ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాక్ చేయండి.

- మీ ఫోన్‌లోని ఇ-మెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అప్లికేషన్‌లను పరిరక్షించుకునేందుకు ‘యాప్ లాక్' ‘App Lock' అనే అప్లికేషన్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి. తద్వారా మీ అకౌంట్‌లను ఎవరు పడితే వాళ్ల ఓపెన్ చేసేందకు ఆస్కారం ఉండదు.

- నెట్ బ్యాకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి లావాదేవీలను స్మార్ట్‌ఫోన్ ద్వారా నిర్వహిస్తున్న సమయంలో అప్రమత్తత ఎంతో అవసరం. ఆయా అకౌంట్‌ల పాస్ వర్డ్ లను తరచూ మార్చటం మంచిది.

- అనధికారిక స్టోర్ల నుంచి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు.

- నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వే‌ర్‌లను ఫోన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X