గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఇప్పుడొక సంచలనం..

Posted By: Staff

 

గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఇప్పుడొక సంచలనం..

గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ ప్రసిద్దికెక్కింది. ఇటీవల గూగుల్ ఆండీ రూబిన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ సుమారు 700, 000 ఆండ్రాయిడ్ యాక్టివేషన్స్ అవుతున్నట్లు తెలిపింది.

గూగుల్ మొబైల్ వైస్ ప్రెసిడెంట్ రూబిన్ మాట్లాడుతూ గూగుల్ ప్రవేశపెట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ ప్రారంభించిన అనతి కాలంలో ఎక్కువ మంది యూజర్స్‌ని పొందడమే కాకుండా, ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేషన్స్‌కి సంబంధించిన సమాచారాన్ని కూలంకుషంగా చర్చించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మొబైల్ యూజర్స్ ఏవిధంగా ఆండ్రాయిడ్‌కి స్టిక్ అవుతున్నారో, ఆండ్రాయిడ్ వల్లఉపయోగాలు తెలిపారు.

ఆండ్రాయిడ్ మొబైల్‌ని తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా విలువైన సమాచారాన్ని అందించేందుకు గాను మేము ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్ గ్రేడ్ వర్సన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని అన్నారు. గతంలో ఉన్న గూగుల్ యాక్టివేషన్స్‌తో గనుక పోల్చి చూస్తే ఇప్పడు గణనీయంగా పెరిగిందని అన్నారు. దానికి సంబంధించిన వివరాలు పాఠకుల కోసం ప్రత్యేకంగా...

* August 2010: 200,000 activations per day

* June 2011: 500,000 activations per day

* July 2011: 550,00 activations per day (130 million devices, 6 billion downloads to date)

* October 2011:  576,900 activations per day, May-October (190 million devices to date)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot