కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు?

By Super
|
Android Jellybean device to be launched in 2012


రెండు దిగ్గాజల మధ్య త్వరలో నెలకొననున్న భీకర పోటీకి సంబంధించి విశ్లేషణలు వేడెక్కుతున్నాయి. గుగూల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 జెల్లీబీన్’, మైక్రోసాఫ్ట్ లెటెస్గ్ ఆపరేటింగ్ సిస్టంలు ‘విండోస్ 8’లు కొద్ది మాసాల తేడాతో విడుదల కానున్న నేపధ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. జెల్లీబీన్ వోఎస్ జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. విండోస్ 8ను అక్టోబర్‌లో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం . ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్‌తో రూపుదిద్దుకున్న హ్యాండ్‌సెట్‌లు 2012 చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. ఈ అంశం పై గగూల్ మాత్రం స్పందించలేదు. ఈ వోస్‌తో వస్తున్న స్మార్ట్‌‌ఫోన్‌లలో సామ్‌సంగ్ రూపొందించిన గుగూల్ నెక్సస్ మొదటిది.

జూన్‌లో నిర్వహించనున్న I / O డెవలపర్ సమావేశంలో జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. కొత్త వోఎస్‌లో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో పాటు సిరి తరహా వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌లను లోడ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆండ్రాయిడ్ ఇటీవల వర్షన్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు మార్కెట్లో ఎనలేని ఆదరణ ఏర్పడింది. సౌకర్యవంతమైన పనితీరు ఇందుకు కారణం. కప్‌కేక్, డోనట్, ఎక్లెయిర్, ఫ్రోయో, జింజర్‌బ్రెడ్, హనీకూంబ్, ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వర్షన్‌లలో ఆండ్రాయిడ్ వోఎస్ లభ్యమవుతున్న విషయం తెలిసిందే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X