ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు

Posted By:

శాన్‌ఫ్రాన్సిస్కోలోని మాస్కోనీ సెంటర్ వేదికగా నిర్వహించిన 2015 గూగుల్ ఐ/ఓ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా, గురువారం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన తరువాతి వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ ఎమ్'కు సంబంధించి డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసింది.

(చదవండి: ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?)

ఈ కొత్త ఓఎస్‌కు సంబంధించిన అధికారిక పేరును అక్టోబర్‌లో గూగుల్ ఖరారు చేసే అవకాశముంది. ఆండ్రాయిడ్ కోర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచే విధంగా కొత్త ఓఎస్‌ను పలు మార్పు చేర్పులతో గూగుల్ అభివృద్థి చేసినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఎం ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

(చదవండి: మీ ఫోన్ ‘సేఫ్ జోన్'లో ఉందా..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అప్లికేషన్ పర్మిషన్లను కంట్రోల్ చేసుకునే సరికొత్త ఆప్షన్‌ను గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రవేశపెట్టనుంది.

‘ఆండ్రాయిడ్ పే' అనే మొబైల్ పేమెంట్ సిస్టంను ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ ప్రవేశపెట్టనుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా డోజ్ స్టేట్ అనే డీప్ స్లీప్ మోడ్‌ను గూగుల్ పరిచయం చయబోతోంది. ఈ ఫీచర్ బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ర్యామ్ మేనేజర్ మెమరీ యూసేజ్‌కు సంబంధించి బోలెడంత సమాచారాన్ని యూజర్లకు అందిస్తుం

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ఆటో బ్యాకప్ ఫీచర్ డేటాను ఆటోమెటిక్‌గా బ్యాకప్ చేసేస్తుంటుంది.

గూగుల్ నౌ ఫీచర్‌లో సరికొత్త నౌ ఆన్ ట్యాప్ ఫీచర్‌ను గూగుల్ జత చేసింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం యూఎస్బీ సీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android M: Top New Features in the Next Major Android Release. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot