చైనా, గూగుల్‌ని ఇబ్బంది పెట్టడానికి కారణం...!!

Posted By: Super

చైనా, గూగుల్‌ని ఇబ్బంది పెట్టడానికి కారణం...!!

కమ్యూనిస్ట్ దేశమైన చైనా గవర్నమెంట్, సెర్చ్ ఇంజన్ గూగుల్‌కీ మద్య గత కొంతకాలంగా వివాదాలున్న విషయం తెలిసిందే. ఇప్పడు కొత్తగా గూగుల్‌పై చైనా ప్రభుత్వం మరొ నిషేధాన్ని విధించింది. ఇంతకీ ఏమిటా నిషేధం అని అనుకుంటున్నారా.. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్, మార్కెట్‌ని యూజర్స్‌కు బ్లాక్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని 'మార్కెట్.ఆండ్రాయిడ్.కామ్ ' స్వయంగా వెల్లడించింది. చైనాలో ఉన్న ఐదు సిటీలలో గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్‌ని నిషేధించినట్లు తెలిపారు.

ఐతే చైనా ప్రభుత్వం ఇలా గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్‌ని బ్లాక్ చేయడం ఇది తొలిసారి మాత్రం కాదని స్పష్టం చేశారు. 2009వ సంవత్సరంలో ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ ఉన్నారో వారందరూ కూడా ఆండ్రాయిడ్ మార్కెట్‌ని యాక్సెస్ చేసుకొలేక యారు. సరిగ్గా మరలా రెండు సంవత్సరాల తర్వాత మరలా చైనా ప్రభుత్వం ఇలా చేయడం వెనుక ఉన్న కారణాలు మాత్రం తెలిసి రాలేదు.

ఇది ఇలా ఉంటే చైనాలో ఉన్న లోకల్ అప్లికేషన్ స్టోర్స్‌ని బ్లాక్ చేయలేదని, కేవలం గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ మార్కెట్‌నే బ్లాక్ చేశారని ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న చైనా యూజర్స్ వాపోతున్నారు. లోకల్ స్టోర్స్ మాత్రం యూజర్స్‌కు కంటెంట్‌ని ఫ్రీగా అందజేయజం జరుగుతుందని తెలిపారు. ఐతే ఈ వివాదం కొన్ని రోజులకే పరిమితం అవుతుందని అంటున్నారు మొబైల్ నిపుణులు. చైనా ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం గూగుల్ చైనా సెర్చ్ ఇంజన్ బైదు త్వరలో సొంతంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేయడమేనని అంటున్నారు.

చైనా సెర్చ్ ఇంజన్ బైదు విడుదల చేయనున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆధారంగా చేసుకునే విడుదల చేయనుందని రూమర్ ప్రచారంలో ఉంది. గతంలో కూడా చైనా ప్రభుత్వం అమెరకాకు చెందిన అఫీసియల్స్ జీమయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసిందంటూ కొంత కాలం మాటల యుధ్దం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే దీనిని చైనా ప్రభుత్వం తేలికగా కొట్టి పారేసింది. అంతేకాకుండా గూగుల్ కొత్తగా విడుదల చేసిన సోషల్ నెట్ వర్క్ గూగుల్ ప్లస్‌ని కూడా చైనాలో బ్లాక్ చేయడం జరిగింది. అసలు చైనా గూగుల్‌ని ఇలా ప్రతిసారి ఇబ్బంది పెట్టడానికి గల కారణం వీరిద్దరి మద్య ఉన్న పోటీ వాతావరణమేనని గ్లోబల్ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot