ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్ !

Written By:

మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. అయితే మీకు గూగుల్ నుంచి అతి త్వరలోనే ఓ బాడ్ న్యూస్ రాబోతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడే వినియోగదారులకు నిజంగా ఇది చేదు వార్తే. ఇంతకీ విషయం ఏంటంటారా..ఇకపై మీ ఫోన్లలో సిగ్నల్‌ను చూపించే బార్స్ కనిపించవట.

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈపై రూ. 8 వేలు తగ్గింపు, అమెజాన్‌లో మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

'ఆండ్రాయిడ్ పి (P)' లో

సెల్ ఆపరేటర్లకు మరింత బలం చేకూర్చేలా వారి విన్నపాల మేరకు గూగుల్ తన కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ పి (P)' లో సిగ్నల్ బార్స్‌ను కనిపించకుండా సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేయనుందని వార్తలు వస్తున్నాయి.

సెల్ నెట్‌వర్క్ సిగ్నల్..

ఈ వార్తల ప్రకారం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కొత్తగా రానున్న ఆండ్రాయిడ్ పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో సెల్ నెట్‌వర్క్ సిగ్నల్ బార్స్ ఇక కనిపించవు. దాని స్థానంలో గూగుల్ తన కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ సెట్టింగ్స్‌లో 'సిమ్ స్టేటస్' అనే ఆప్షన్‌ను ఏర్పాటు చేయనుందని సమాచారం.

ఓ సాఫ్ట్‌వేర్ కోడ్‌లో..

ఇప్పటికే ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏఓఎస్‌పీ)కు సంబంధించిన ఓ సాఫ్ట్‌వేర్ కోడ్‌లో దర్శనమిచ్చిందని ఎక్స్‌డీఏ డెవలపర్స్ అనే సైట్ ముందుగా తెలియజేసింది.

రానున్న ఆండ్రాయిడ్ డివైస్‌లలో

దీన్ని బట్టి చూస్తే ఇకపై రానున్న ఆండ్రాయిడ్ డివైస్‌లలో సెల్ ఆపరేటర్ నెట్‌వర్క్‌కు చెందిన సిగ్నల్ బార్స్ కనిపించవనే మాట నిజమే అని తెలుస్తున్నది. దీనిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి

ఇదే జరిగితే ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఫోన్లో సిగ్నల్స్ ను బట్టి మనం కాల్ చేసుకోవడమే. సిగ్నల్ ఎంత ఉందనేది తెలియకుండా కాల్స్ చేయడం కొంచెం కష్టతరమవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

గూగుల్ నుంచి స్పష్టత వచ్చే దాకా..

మరి గూగుల్ ఈ ఫీచర్ నిజంగానే తెస్తుందా లేదా అనే దానిపై గూగుల్ నుంచి స్పష్టత వచ్చే దాకా వేచి చూడక తప్పదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android May Let Carriers Hide Signal Strength: Report Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot