రికార్డులు మావే.. సంచలనాలు మావే?

Posted By: Prashanth

రికార్డులు మావే.. సంచలనాలు మావే?

 

‘మాకు మేమే సాటని చైనా మరోసారి నిరూపించుకుంది.. సరికొత్త ఆవిష్కరణల కోసం ప్రతినిత్యం పాకులాడే ఈ దేశ గ్యాడ్జెట్ తయారీ కంపెనీలు తంబ్ డ్రైవ్ నమూనాలో ఆండ్రాయిడ్ మినీ కంప్యూటర్ ను రూపొందించి మరో సంచలనానికి తెరలేపాయి’

ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లు అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్లు మార్కెట్లో కోకొల్లలుగా లభ్యమవుతున్నాయి.  అందరిలా ట్రై చేస్తే మజా ఎముంటుందని  అనుకుంది కాబోలు ఆ చైనా సంస్థ.. కంప్యూటర్లతో  పాటు ల్యాప్‌టాప్‌లకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్పందించే విధంగా ఓ తంబ్ డ్రైవ్‌ (ఆండ్రాయిడ్ మినీ కంప్యూటర్‌ను) రూపొందించింది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే ఈ డ్రైవ్‌ను ల్యాప్‌టాప్ అదేవిధంగా డెస్కటాప్ పీసీకి  కనెక్ట్ చేసుకుని పరిపూర్ణమైన ఆండ్రాయిడ్ కంప్యూటంగ్‌ను ఆస్వాదించవచ్చు.

ఎమ్ కె802గా డబ్ కాబడిన ఈ తంబ్ డ్రైవ్‌లో 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ఆల్ విన్నర్ ఏ10 లేదా కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్‌ను లోడ్ చేసే ఆస్కారం ఉంది. డ్రైవ్‌లో 4జీబి ఇంటర్నెల్ స్టోరేజ్ స్పేస్‌తో పాటు, 512 ర్యామ్‌ను నిక్షిప్తం చేశారు.  వై-ఫై, హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ చిన్నతరహా గ్యాడ్జెట్‌లో  ఇన్‌బుల్ట్ చేశారు. మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్ సాయంతో ఎక్సటర్నల్ మెమెరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు. డివైజ్ లో ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ పోర్టు సౌలభ్యతతో 1080పిక్సల్ క్లారిటీతో కూడిన వీడియో అవుట్‌పుట్‌ను ఆస్వాదించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot