Android Nougat ప్రత్యేకతలేంటి..?

గూగుల్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం Android Nకు సంబందించి అధికారిక పేరును విడుదల చేసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ కొత్త ఓఎస్‌కు Nougatగా నామకరణం చేసింది. ఆండ్రాయిడ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టంను ఇక పై ఆండ్రాయిడ్ నౌగట్‌గా పిలవాల్సి ఉంటుంది. మేలో జరిగిన 2016 గూగుల్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా అందరిని ఆశ్చర్యచకితులను చేస్తూ గూగుల్ తన Android N డెవలపర్స్ ప్రివ్యును ఆవిష్కరించింది.

Android Nougat ప్రత్యేకతలేంటి..?

డెవలపర్లు ఈ ప్రివ్యూను నెక్సుస్ 6పీ, నెక్సుక్స్ 5ఎక్స్, నెక్సుస్ 6, నెక్సుస్ 9(Wi-Fi,LTE), నెక్సుస్ ప్లేయర్, పిక్సల్ సీ డివైస్‌ల ద్వారా పరీక్షించే అవకాశాన్ని గూగుల్ కల్పించింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఫైనల్ వర్షన్‌ను సెప్టంబర్ 30న గూగుల్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త వర్షన్ ఓఎస్, తొలిగా.. నెక్సుస్ డివైస్‌లతో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే కొత్త ఫీచర్ల పై స్పెషల్ ఫోకస్...

Read More : తేజస్ యుద్ధ విమానాలు వచ్చేసాయ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధునీకరించబడిన సెట్టింగ్స్ మెనూ

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో సెట్టింగ్స్ యాప్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. పలు మార్పు చేర్పులతో వస్తోన్న ఈ యాప్, ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత వేగంగా ముందకు నడిపిస్తుంది. ఫొన్ సెట్టింగ్జ్ అడ్జస్ట్ చేసుకునేందుకు యూజర్ ప్రతిసారి సబ్ మెనూలోకి వెళ్లకుండా మెయిన్ మెనూ ద్వారానే కావల్సిన సెట్టింగ్స్ యాక్సెస్ చేసుకునే విధంగా సబ్ టైటిల్ వ్యవస్థ ఉంటుంది.

 

మల్టీ విండో సపోర్ట్ :

Android N ప్రత్యేకతలేంటి..?

గూగుల్ ఎట్టకేలకు తన సరికొత్త ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ ద్వారా మల్టీ-విండో మోడ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ సౌలభ్యతతో ఫోన్‌లోని యాప్స్‌ను split- screen మోడ్‌లో, ఫోటోలను picture-in-picture మోడ్‌లో ఓపెన్ చేసుకోవచ్చు.

 

 

నైట్ మోడ్

Android N ప్రత్యేకతలేంటి..?

గూగుల్ తన ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్‌లో నైట్ మోడ్ ఫీచర్‌ను పొందుపరిచింది. ఈ నైట్ మోడ్ ఆప్షన్ ద్వారా యూజర్, ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను రాత్రి వేళల్లో డార్క్ కలర్‌కు మార్చుకోవచ్చు. తద్వారా మెరుగైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించవచ్చు.

 

Unicode 9

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ Unicode 9ను సపోర్ట్ చేస్తుంది. అంటే సరికొత్త emojis మీకోసం వస్తున్నాయన్నమాట.

క్విక్ సెట్టింగ్స్‌

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ అప్‌డేటెడ్ క్విక్ సెట్టింగ్స్‌తో రాబోతోంది.

రీసెంట్ యాప్ మెనూ

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలోని రీసెంట్ యాప్ మెనూ, స్వల్ప మార్పు చేర్పులతో వస్తోంది. ఈ మెనూ ద్వారా, ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతోన్న యాప్‌లకు సంబంధించిన వివరాలను పెద్ద కార్డ్‌లలో చూసుకోవచ్చు.

 

Project Svelte

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ Project Svelte ఫీచర్‌తో కంటిన్యూ అవుతుంది. ఈ ఫీచర్ ఫోన్‌ ప్రాసెసింగ్ అలానే బ్యాటరీ సేవింగ్‌ విభాగాలు మరింత యాక్టివ్‌గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

 

సిస్టం లెవల్ నెంబర్ లాకింగ్

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ ద్వారా గూగుల్ సిస్టం లెవల్ నెంబర్ బ్లాకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ నేటివ్ సపోర్ట్ ద్వారా ఫోన్‌కు వచ్చే అన్‌వాంటెడ్ నెంబర్లను బ్లాక్ చేయవచ్చు.

 

Always on VPN

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌‌లో వచ్చే Always on VPN ఫీచర్ ద్వారా ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకోవచ్చు.

 

Save More Data

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌‌లో వచ్చే డేటా సేవర్ ఆప్షన్ ద్వారా ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్‌ను కంట్రోల్ చేసుకుంటూ డేటాను మరింత ఆదా చేసుకోవచ్చు.

 

mergency Information feature

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ ద్వారా గూగుల్ Emergency Information featureను అందిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ ఫీచర్ ద్వారా యూజర్ మెడికల్ డిటెయిల్స్ అలానే వ్వక్తిగత కాంటాక్ట్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఫోన్‌లోని ఎమర్జెన్సీ బటన్ పై టాప్ చేయటం ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు.

 

పైల్స్‌ను సులువుగా

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ ద్వారా ఫోన్‌లోని పైల్స్‌ను సులువుగా మేనేజ్ చేసుకునే వీలుంటుంది.

Doze mode ఫీచర్

Android N ప్రత్యేకతలేంటి..?

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌లో ఏర్పాటు చేసిన Doze mode ఫీచర్ ఫోన్ బ్యాటరీ శక్తిని మరింత ఆదా చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android N named Nougat: 15 Cool features and updates it will bring to your Android phones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot