రాబోతోంది ఆండ్రాయిడ్ Oreo కాదు, ఆండ్రాయిడ్ Orellete!

మరికొద్ది గంటల్లో అఫీషియల్‌గా లాంచ్ కాబోతోన్న ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం Android 8.0కు సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Read More : షియోమీ, గూగుల్ కాంభినేషన్‌లో Android One స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Android O అంటే ఆండ్రాయిడ్ Orellete

ఇంతకాలం అందరూ భావించినట్లు Android O అంటే ఆండ్రాయిడ్ Oreo కాదని లేటెస్ట్ లీక్స్ చెబుతున్నాయి. Android O అంటే ఆండ్రాయిడ్ Orellete అని నోవా లాంచర్ కస్టమర్ సపోర్ట్ మేనేజర్ Cliff Wade నిర్థారించారు. అయితే గూగుల్ ఈ సమాచారాన్ని ధృవీకరించాల్సి ఉంది.

Orellete అంటే ..?

Orellete అంటే ఓ రకమైన స్వీట్ Catalan పేస్ట్రీ. పాశ్చాత్య దేశాల్లో ఈ తిండి పదర్థానికి అమితమైన ఆదరణ ఉంది. దీంతో గూగుల్ తన ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టంకు ఈ పేరును సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 12.10 నిమిషాలకు అమెరికాలో లాంచ్ కాబోతోంది.

ఆండ్రాయిడ్ 8.0 ముందుగా లభించేది ఈ ఫోన్‌లకే..?

తొలత ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గూగుల్ సొంత డివైస్‌లైన Google Pixel, Google Pixel XL, Nexus 5X, Nexus 6P, Nexus Player, Google Pixel Cలకు లభిస్తుంది.

మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో విప్లవాత్మక మార్పులు

గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలికే విధంగా డిజైన్ చేయబడిన Android O ఆపరేటింగ్ సిస్టంలో పిక్షర్ ఇన్ పిక్షర్ వీడియో వ్యూవింగ్ మోడ్‌తో పాటు నోటిఫికేషన్ ఛానల్స్, బెటర్ కీబోర్డ్ నేవిగేషన్, వైడర్ కలర్ గామట్ ఇన్ ఇమేజింగ్ యాప్స్ వంటి కొత్త ఫీచర్లు ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ఉండనున్నాయి.

మెరుగైన బ్యాటరీ లైఫ్..

Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో గతంలో కన్నా బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా వచ్చేలా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ బ్యాటరీ వాడుకోవడాన్ని నియంత్రించే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇందులో తీర్చిదిద్దారు.

నోటిఫికేషన్ కంట్రోలింగ్ వ్యవస్థ...

Android O ఆపరేటింగ్ సిస్టంలో యూజర్లు నోటిఫికేషన్లను మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అవసరం లేని నోటిఫికేషన్లను బ్లాక్ చేయవచ్చు. కావాలనుకుంటే వాటిని కొంత సేపు అయ్యాక మళ్లీ కన్పించేలా రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.

వ్యక్తిగత డేటాకు అదనపు సెక్యూరిటీ..

Android O ఆపరేటింగ్ సిస్టం యూజర్లు ఫోన్‌లో సేవ్ చేసుకునే డేటా మరింత సురక్షితంగా ఉండేదుగాను గూగుల్ కొత్త యాప్‌లను తీసుకువచ్చింది. రెండు, మూడు యాప్‌లను ఒకేసారి స్క్రీన్‌పై వాడుకునేందుకు వీలుగా Android Oలో మల్టీ విండో మోడ్‌ను గూగుల్ అందిస్తోంది..

Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త ఫాంట్లు

గతంలో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరిన్ని కొత్త ఫాంట్లను గూగుల్ చేర్చింది. వాటితో యూజర్లు తమ డివైస్‌లోని ఫాంట్‌లను తమ ఇష్టాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

న్యూ ఐకాన్స్ ఇంకా సరికొత్త ఫీచర్లు..

 ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌తో పోలిస్తే Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు ఐకాన్లను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల డిస్‌ప్లేలపై కూడా డివైస్ స్క్రీన్ మరింత ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. మీరు ఇంటర్నెట్ బ్రౌజర్లలో వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు అవి క్రాష్ కాకుండా ఉండేందుకు గాను Android Oలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసారు. గతంలో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే Android O రెండు రెట్లు వేగంతో పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android O being surprisingly called Android Orellete. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot