Android P, మీకు తెలియని కొత్త ఫీచర్లు తెలుసుకోండి

  ఆండ్రాయిడ్ తదుపరి వెర్షన్ వచ్చేస్తోంది. ఆండ్రాయిడ్ 'పి' పేరుతో డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ లో ఇది విడుదలైంది. ఆండ్రాయిడ్ 'పి' వెర్షన్ ఫీచర్లన్నీ బయటకు రాలేదు. డెవలపర్లు అందించిన సమాచారం మేరకు దీనిలో అనేక రకాలైన కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే గూగుల్ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ ఆండ్రాయిడ్ పికి సంబంధించిన కొన్ని ఫీచర్లు అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కుద్దాం.

  ముగస్తున్న జియో ప్రైమ్ గడువు, మరో మ్యాజిక్ దిశగా జియో !

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ఫేస్ అన్‌లాక్ ఫీచర్..

  గూగుల్ సంస్థ త్వరలో విడుదల చేయనున్న ‘ఆండ్రాయిడ్ పి' ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కోసం ఐరిస్ స్కానర్‌కు సపోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.

  Pic Source : androidcentral.com

  ఆండ్రాయిడ్ ఫోన్లలో

  కాగా పలు ఆండ్రాయిడ్ ఫోన్లలో లభిస్తున్న ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మాత్రం అంత విజయవంతం కాలేదు. యూజర్‌కు చెందిన ఫొటోతో కూడా ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు వీలుండడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ సక్సెస్ కాలేకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ సంస్థ త్వరలో విడుదల చేయనున్న 'ఆండ్రాయిడ్ పి' ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఐరిస్ స్కానర్‌కు సపోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

  మరింత సమర్థవంతంగా ..

  దీని వల్ల ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను మరింత సమర్థవంతంగా యూజర్లకు అందించేందుకు వీలు కలుగుతుంది. ఆండ్రాయిడ్ పి ఓఎస్ ఉన్న ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అప్పుడు యూజర్లందరికీ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ భావిస్తున్నట్లు తెలిసింది.

  Pic Source : androidcentral.com

  ఆపిల్ ఐఫోన్ ఎక్స్ మాదిరిగా..

  ఆపిల్ ఐఫోన్ ఎక్స్ మాదిరిగా ఆండ్రాయిడ్ పి కూడా ఫుల్ స్క్రీన్లను సపోర్ట్ చేస్తుంది. మెస్సేజ్ నోటిఫికేషన్ రాగానే వాటిని స్వైప్ డౌన్ చేసి ఇమేజ్ లను అటాచ్ చేసి ఉంటే వాటిని చూసుకునే వీలుంటుంది. హోమ్ స్క్రీన్ లోనే నోటిఫికేషన్ ట్రే నుంచి మెస్సేజ్ చూడడంతోపాటు రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు. ఒక్కరికే కాదు గ్రూప్ మెస్సేజ్ కు కూడా వీలవుతుంది.

  ఇమేజ్ సైజును కంప్రెస్..

  మరింత డేటా, ఫోన్ లో స్పేస్ ఆదా కోసం ఇమేజ్ సైజును కంప్రెస్ చేసుకోవచ్చు. కంప్రెస్ చేసినా గానీ క్వాలిటీ తగ్గదు. ఇలాంటివే మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సులో దీన్ని ఆవిష్కరించే అవకాశం మార్కెట్ వర్గాల సమాచారం.

  మల్టిపుల్ కెమెరా

  ఈ ఫీచర్ కొన్ని మొబైల్స్ లో ఉన్నప్పటికీ పూర్తి స్తాయిలో అందుబాటులో లేదు. అయితే గూగుల్ రానున్న ఆపరేటింగ్ సిస్టంలో మల్టిపుల్ కెమెరా ఫీచర్ ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా మీరు ఏకకాలంలో సెల్ఫీ అలాగే బ్యాక్ కెమెరాతో షూట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే కెమెరాలో ఉన్న ఫీచర్లకూడా కొత్త మెరుగులు దిద్దుకోనున్నాయి.

  Pic Source : androidcentral.com

  ఇంకా డెవలపర్ వర్షన్ లోనే ...

  అయితే గూగుల్ నుంచి రానున్న ఈ ఫీచర్ ఇప్పుడే అందుబాటులోకి రాకపోవచ్చు. ఇది ఇంకా డెవలపర్ వర్షన్ లోనే ఉంది. పూర్తి స్తాయిలో రావడానికి చాలా సమయం పట్టవచ్చు అప్పటిదాకా కొత్త ఆపరేటింగ్ సిస్టం కోసం అందరూ వెయిట్ చేయాల్సిందే.

  సిగ్నల్ బార్స్‌ను..

  సెల్ ఆపరేటర్లకు మరింత బలం చేకూర్చేలా వారి విన్నపాల మేరకు గూగుల్ తన కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ పి (P)' లో సిగ్నల్ బార్స్‌ను కనిపించకుండా సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేయనుందని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తల ప్రకారం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కొత్తగా రానున్న ఆండ్రాయిడ్ పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో సెల్ నెట్‌వర్క్ సిగ్నల్ బార్స్ ఇక కనిపించవు. దాని స్థానంలో గూగుల్ తన కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ సెట్టింగ్స్‌లో 'సిమ్ స్టేటస్' అనే ఆప్షన్‌ను ఏర్పాటు చేయనుందని సమాచారం.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Google has cracked the lid on the next version of Android so developers can peek inside and prepare their apps for all of the new features coming our way later this year. While it's not quite time to smash the update button on your phone for Android P, there are plenty of things worth getting excited about already.
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more