Android Qలో ఆరు బెస్ట్ ఫీచర్లు ఇవే, ఓ లుక్కేసుకోండి

దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం గూగుల్ క్యూని మార్కెట్లోకి తీసుకువస్తోంది.

|

దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం గూగుల్ క్యూని మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆండ్రాయిడ్ పై విజయవంతం అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆండ్రాయిడ్ క్యూ మీద అందరికీ భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ వర్షన్ ని గూగుల్ Google IO 2019 conferenceలో బహిర్గతం చేసింది. కాగా ఈ ఆపరేటింగ్ సిస్టం ఈ ఏడాది మేలో లైవులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. కాకుంటే కొన్ని ఫీచర్లు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గూగులే వీటిని స్వయంగా లీక్ చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.

మార్చిలో జియో GigaFiber సేవలు, బేసిక్ ప్లాన్ ఖరీదు రూ.500?మార్చిలో జియో GigaFiber సేవలు, బేసిక్ ప్లాన్ ఖరీదు రూ.500?

Foldable phone support

Foldable phone support

రానున్న ఆండ్రాయిడ్ క్యూని ఫోల్డబుల్ ఫోన్ ని సపోర్ట్ చేసే విధంగా తీర్చిదిద్దనున్నారు. కాగా గతేడాది శాంసంగ్ బహిర్గతం చేసిన ఫోల్డబుల్ ఫోన్ లో ఈ ఆపరేటింగ్ సిస్టం ఉంది. ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఫోల్డబుల్ ఫోన్ లో సపోర్ట్ చేయనున్నాయి.

Dark Mode

Dark Mode

కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్‌ను ఇవ్వ‌నున్నారు. కాగా ఇప్పటికే డార్క్ మోడ్ ధీమ్ లో పలు రకాల ఫీచర్లను అందించిన సంగతి తెలిసిందే.

Enhanced PiP mode

Enhanced PiP mode

నోటిఫికేష‌న్ల‌ను పూర్తిగా బ్లాక్ చేయ‌డం లేదా సైలెంట్ గా షో చేసే విధంగా సెట్ చేసుకునే ఫీచ‌ర్ల‌ను ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌లో అందివ్వ‌నున్నారు.

Native support for facial recognition

Native support for facial recognition

ఫేస్ రిక‌గ్నిష‌న్‌కు మ‌రింత సెక్యూరిటీని జోడించారు. దీని వ‌ల్ల యూజ‌ర్‌కు చెందిన ఫొటో కాకుండా ముఖాన్ని స్కాన్ చేస్తేనే డివైస్ అన్‌లాక్ అవుతుంది.

More permissions

More permissions

ఈ ఫీచర్ ద్వారా మీరు గూగుల్ క్లిప్ బోర్డులో ఏం యాప్స్ సేవ్ చేసుకోవాలనే విషయం అడుగుతుంది. తద్వారా మీరు మీకు నచ్చిన యాప్స్ ఇందులో సేవ్ చేసుకోవచ్చు.

Support for downgrading any app

Support for downgrading any app

ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌లో సిస్ట‌మ్ లెవ‌ల్ స్క్రీన్ రికార్డింగ్ ఫీచ‌ర్‌ను అందివ్వ‌నున్నారు. ఇక ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయ‌డం ద్వారా ఎమ‌ర్జెన్సీ కాల్స్ చేసుకునే విధంగా సిస్ట‌మ్ యూఐ ని తీర్చిదిద్దారు. దీంతోపాటు ఫోన్‌లో ఉండే సెన్సార్ల‌ను ఆన్‌/ఆఫ్ చేసుకునే విధంగా ఫీచ‌ర్ ఇవ్వ‌నున్నారు.

Best Mobiles in India

English summary
Android Q: 6 likely features that will change the way you use your smartphone more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X