ఇక ఒకే స్క్రీన్ పై రెండు యాప్‌లను రన్ చేసుకోవచ్చు

|

గూగుల్ అప్‌కమ్మింగ్ ఆండ్రాయిడ్ వెర్షన్, ఆండ్రాయిడ్ క్యూ (Android Q) సరికొత్త ఫీచర్ తో రాబోతోంది. మల్టీ-రెస్యూమ్ (Multi-Resume) అనే ఫీచర్‌ను గూగుల్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో యాడ్ చేసింది. ముఖ్యంగా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లను ఉద్దేశించి ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గూగుల్ తన డెవలపర్స్ సమ్మిట్ లో భాగంగా పేర్కొంది.

2018కి గాను టాప్10లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..!

ఫోల్డబుల్ టైప్ డిస్‌ప్లేలలో..
 

ఫోల్డబుల్ టైప్ డిస్‌ప్లేలలో..

ఫోల్డబుల్ టైప్ డిస్‌ప్లేలలో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఏ విధంగా కనిపిస్తుంది అనే దాని పై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ డేవ్ బుర్క్ పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. ఈ మల్టీ-రెస్యూమ్ ఫీచర్ అనేది నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో మ్యాండటరీ బిహేవియర్‌గా మారబోతోందట. ఈ ఫీచర్‌లో భాగంగా స్ర్కీన్ పై ఒకేసారి రెండు యాప్‌లను ఓపెన్ చేసి రన్ చేసుకోవచ్చు.

మల్టీస్టార్ పేరుతో సామ్‌సంగ్ ఇప్పటికే..

మల్టీస్టార్ పేరుతో సామ్‌సంగ్ ఇప్పటికే..

ఈ విధమైన మల్టీ-రెస్యూమ్ ఫీచర్‌ను మల్టీస్టార్ మాడ్యుల్ పేరిట సామ్‌సంగ్ ఇప్పటికే తన గు‌డ్‌లాక్ యాప్ ద్వారా అందిస్తోంది. గూగుల్ లేటెస్ట్ అనౌన్స్ మెంట్ ప్రకారం, ఈ మల్టీ రెజ్యూమ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ డివైసెస్లో నేటివ్ సపోర్టుతో లభ్యంకాబోతోంది.

మల్టీ-రెజ్యూమ్ అప్‌డేట్‌ను రోల్-అవుట్ చేయవల్సి ఉంటుంది..

మల్టీ-రెజ్యూమ్ అప్‌డేట్‌ను రోల్-అవుట్ చేయవల్సి ఉంటుంది..

ఎక్స్‌డిఏ డెవలపర్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ ఫీచర్‌ను టెస్ట్ చేసే క్రమంలో ఓఈఎమ్ అలానే యాప్ ఆండ్రాయిడ్ పై డివైస్‌ను ఆప్ట్ చేసుకోవల్సి ఉంటుంది. మల్టీ-రెస్యూమ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునే క్రమంలో ఓరిజనల్ ఎక్విప్‌మెంట్ మేనేజర్స్ ముందుగా ఆయా స్మార్ట్‌ఫోన్‌లకు ముందుగా మల్టీ-రెజ్యూమ్ అప్‌డేట్‌ను రోల్-అవుట్ చేయవల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ నౌగట్ ద్వారా...
 

ఆండ్రాయిడ్ నౌగట్ ద్వారా...

మల్టీ-విండో ఫంక్షనాలిటీ అనేది ప్రస్తుతం అనేక పద్థతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులో ఉంది. తొలత ఈ ఫీచర్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ పేరుతో ఆండ్రాయిడ్ నౌగట్ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యింది. ఆ తరువాత ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ ద్వారా పిక్షర్-ఇన్-పిక్షర్ మోడ్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. స్ప్లిట్ స్క్రీన్ మోడ్‌లో భాగంగా ఒకే ట్యాబ్‌లో రెండు యాప్‌లు ఓపెన్ అయినప్పటికి, వీటిలో ఒక యాప్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. త్వరలో తీసుకురాబోతోన్న మల్టీ-రెజ్యూమ్ ఫీచర్ ద్వారా ఈ లిమిటేషన్స్ అనేవే లేకుండా స్క్రీన్ పై ఒకేసారి రెండు యాప్‌లను ఒకేసారి వినియోగించుకునే వీలుంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Android Q ‘multi-resume’ feature will allow two apps to run simultaneously.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X