గూగుల్ కొత్త ఓఎస్ పేరు ఆండ్రాయిడ్ 10, క్యూకి గుడ్ బై
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గూగుల్ కొత్త వెర్షన్ విడుదల చేసినప్పుడల్లా తిను బండారమో, తీపి పదార్థం పేరో పెడుతూ ఉంటుంది. అయితే ఈ సంప్రదాయానికి ఆండ్రాయిడ్ ఈసారి ముగింపు పలికింది. ఇకపై అలాంటి పదాలను కాకుండా కొత్తగా పెట్టే ఆలోచనలో ఉంది.

అందులో భాగంగా కొత్త వెర్షన్ పేరును మార్చివేసింది. ఇప్పటివరకూ వస్తున్న వెర్షన్ల క్రమం ప్రకారం దీని కొత్త వెర్షన్ క్యూ అక్షరంతో ప్రారంభం కావాలి. అయితే దీనికి ముగింపు పలుకుతూ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే కొత్త ఎడిషన్‌ను ఆండ్రాయిడ్ 10గా నామకరణం చేసింది.

ఆండ్రాయిడ్ 10
నిజానికి ఈ వెర్షన్ 17వది అయినప్పటికీ అందరికీ సులభంగా తెలిసేలా దీనికి ఆండ్రాయిడ్ 10 అని పేరు పెట్టింది. అయితే లెటర్స్ తో వచ్చే పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అర్థం కావడం లేదని మాకు గత కొన్నేళ్లుగా ఫీడ్ బ్యాక్ వస్తోందని అందుకే కొత్తగా మార్చివేసామని గూగుల్ చెబుతోంది.

గూగుల్ ఒపీనియన్ పోల్
ఇదిలా ఉంటే కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌కు పేరు పెట్టేందుకు గూగుల్ ఒక ఒపీనియన్ పోల్ కూడా నిర్వహించింది. అందులో అది 'క్యూ' అక్షరంతో వచ్చే కొన్ని పేర్లు ఇచ్చి, వాటిలో ఒకటి ఎంపిక చేయమంది. అయితే దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆండ్రాయిడ్ 10 అని పేరు ఫిక్స్ చేసింది.

క్యూఆర్ కోడ్
ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని బబుల్స్ అనే సదుపాయం పనిచేస్తుందని సమాచారం. దీని ప్రకారం మీరు ఫోన్ లో ఓ పని చేస్తున్నప్పుడు మీరు యాక్టివ్ గా ఉండే అప్లికేషన్ వివరాలు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలో వైఫై ప్రతీసారి టైప్ చేసే అవకాశం లేకుండా క్యూఆర్ కోడ్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా మీరు నేరుగా వైఫైకి కనెక్ట్ కావచ్చు

అన్‌డూ ఆప్షన్
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలో అన్‌డూ అనే ఆప్షన్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీరు ఒక అప్లికేషన్ షార్ట్‌కట్‌ని హోమ్ స్క్రీన్ నుంచి తొలగించిన కొద్ది క్షణాలలోపు దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. అది మీరు ఎక్కడ నుంచి అయితే డిలీట్ చేశారో అక్కడే కనిపిస్తుంది. దీంతో పాటు మరిన్ని ఫిచర్లను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే వివరాలు ఇంకా బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications








