ఫిబ్రవరి 14న ఫేస్‌బుక్‌లోకి 'యాంగ్రీ బర్డ్స్'

Posted By: Prashanth

ఫిబ్రవరి 14న ఫేస్‌బుక్‌లోకి 'యాంగ్రీ బర్డ్స్'

 

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అన్న విషయం అందరికి తెలిసిందే. ఇదే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రపంచపు పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌‌బుక్ లోకి 'యాంగ్రీ బర్డ్స్ సిరిస్' గేమ్స్‌ని పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళితే ఫిన్నిష్ కంపెనీ అయిన 'యాంగ్రీ బర్డ్స్' ఫేస్‌బుక్ లోకి తన గేమ్స్‌ని బ్లాక్ బస్టర్ టైటిల్ 'క్యాపిటల్ ఆఫ్ ఫేస్‌బుక్' పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

మొదటగా యాంగ్రీ బర్డ్స్ ప్రపంచంలో ఎక్కువ మంది ఫేస్‌బుక్ యూజర్స్‌ని కలిగి ఉన్న ఇండోనేషియా జకార్తా(17 మిలియన్ ఫేస్ బుక్ యూజర్స్)లో విడుదల చేయనుంది. ఆసియాలో యాంగ్రీ బర్డ్స్ గేమ్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యతను కల్పించడానికి గాను, చైనాలో ఆఫీసుని కూడా ప్రారంభించనున్నట్లు రోవియా తెలిపారు. దీని ద్వారా 1 బిలియన్ డౌన్ లోడ్స్‌ని ఆశిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆసియా దేశాలలో టెక్నాలజీ బాగా అభివృద్ది చెందుతుందని అన్నారు. దీనిని పురష్కరించుకోనే ఆసియాలో ఎక్కువ అభివృద్దిని టార్గెట్ చేస్తున్నామని అన్నారు.

యాంగ్రీ బర్డ్స్ కంపనీ ఇప్పటికే శాంసంగ్ టివీలలో తమ గేమ్స్‌ని ప్లే చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. నోకియాతో కూడా త్వరలో ఒప్పందం కుదుర్చుకోని నోకియా ఆశా సిరిస్‌లో యాంగ్రీ బర్డ్స్ గేమ్స్‌ని నిక్షిప్తం చేయనున్నామని అన్నారు. ఆసియాలో ఉన్న నాన్ స్మార్ట్ ఫోన్స్ సెగ్మెంట్లో కూడా పాగా వేసేందుకు గాను తగు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot