హామ్మయ్య నాకు రెండు సంవత్సరాలు..

Posted By: Prashanth

హామ్మయ్య నాకు రెండు సంవత్సరాలు..

 

రోవియో మొబైల్ రూపొందించిన 'యాంగ్రీ బర్డ్స్' పాపులర్ గేమ్ రెండు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంలో యాంగ్రీ బర్డ్స్ డెవలపర్స్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్బంలో యాంగ్రీ బర్డ్స్ గేమ్స్‌లో కొన్ని కొత్త లెవల్స్‌ని యాడే చేశామన్నారు. యాంగ్రీ బర్డ్స్ పుట్టిన రోజు స్పెషల్ సందర్బంగా విడుదల చేసిన 15 లెవల్స్ కొత్త అప్‌డేట్ గేమింగ్ వర్సన్‌ని యూజర్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా యాంగ్రీ బర్డ్స్ ప్రతినిధి తెలిపారు. మొత్తం ఈ యాంగ్రీ బర్డ్స్ గేమింగ్‌లో 300 లెవల్స్ ఉన్నట్లు తెలిపారు.

అంతేకాకుండా యాంగ్రీ బర్డ్స్ గ్రూప్‌లోకి ఓ సరిక్రొత్త బర్డ్‌ని పుట్టిన రోజు సందర్బంగా జత చేశారు. ఈ కొత్త నారింజ పక్షి ఒక బెలూన్ మాదిరి ఉండి ప్రత్యేక కాల్చే ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఈ కొత్త అప్లికేషన్‌లో కొత్త మెనుతో పాటు.. విజువల్‌గా కూడా కొన్ని మార్పులను చేశారు. యూజర్స్‌ని మరింత ఉత్తేజపరిచేందుకు గాను ఇందులో 'ఎచీవ్‌మెంట్ ఫీచర్'ని నిక్షిప్తం చేశారు.

యూజర్స్‌కు ఇంకో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమింటటే అన్ని లెవల్స్‌ కూడా అన్‌లాక్ అయి ఉండండతో... యూజర్స్ ఒక నిర్దిష్ట స్దాయిని ముగించకుండానే మరో కొత్త లెవల్‌కి వెళ్లోచ్చు. అధికారకంగా మార్పులు చేసిన యాంగ్రీ బర్డ్స్ అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అందుబాటులో ఉండగా.. త్వరలోనే మిగిలిన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అందుబాటులో వస్తుందని యాంగ్రీ బర్డ్స్ ప్రతినిధులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot