విడుదలైన 3 రోజులకే 10 మిలియన్ డౌన్‌లోడ్స్

Posted By: Super

విడుదలైన 3 రోజులకే 10 మిలియన్ డౌన్‌లోడ్స్

 

ఇంటర్నెట్‌ని ఉపయోగించే వారికి పరిచయం అక్కర లేని గేమ్ 'యాంగ్రీ బర్డ్స్' . యాంగ్రీ బర్డ్స్ ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'యాంగ్రీ బర్డ్స్ స్పేస్' గేమ్ విడుదలైన 3 రోజుల్లో 10 మిలియన్ డౌన్ లోడ్స్‌ని చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా 'యాంగ్రీ బర్డ్స్' ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేశారు.

కొత్తగా విడుదల చేసిన యాంగ్రీ బర్డ్స్ స్పేస్ గేమ్‌లో బర్డ్స్  మరియు పందులు గురుత్వాకర్షణ నుండి దూరంగా వెళ్లడంతో స్పేస్‌లో ఉన్న స్పేస్ ఈగల్స్ తో ఏ విధంగా తలపడతాయో ఇందులో వినూత్నంగా ఆవిష్కరించారు. ఈ యాంగ్రీ బర్డ్స్ స్పేస్ గేమ్‌ అప్లికేషన్‌ని డౌన్ లోడ్ చేసుకున్న వారు కొత్త అనుభూతిని పొందుతారు. ఈ గేమ్‌లో దాగిఉన్న గూడీస్, సీక్రెట్ లెవల్స్, కూల్ స్పేస్ కంటెంట్ వినియోగదారులకు ఆథ్యం ఆసక్తిని రేకెత్తిస్తాయి.

అప్లికేషన్ స్టోర్‌లో యాంగ్రీ బర్ట్స్ స్పేస్ గేమ్... ఐఫోన్ మరియు ఐపాడ్ టచ్ లకు $ 0.99, ఐప్యాడ్‌కు $2.99, పర్సనల్ కంప్యూటర్‌కు $5.95 లభిస్తుంది. అదే ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్ 'గూగుల్ ప్లే' నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot