అన్నదమ్ముల మధ్య జియో చిచ్చు, అసలేమైంది..?

Written By:

టెలికాం మార్కెట్లో ఇతర టెల్కోలకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతున్న జియోకు సొతింటిం నుంచే కుంపటి మొదలైంది. జియోపై అనిల్ అంబాని భారీస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సంచలన ఆరోపణలు ఊహించని ముఖేష్ అంబాని ఒక్కసారిగా ఖంగుతిన్నట్లు సమాచారం. మరి ఆర్ కామ్ అధినేత ఎందుకలా ఫైర్ అయ్యారు..ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

స్పీడ్‌లో దుమ్మురేపిన జియో, Airtelకి పెద్ద షాక్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంబానీ బ్రదర్స్‌ మధ్య చిచ్చు

టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్‌ మధ్య చిచ్చు పెట్టింది. జియో పై ఆర్‌కాం సంచలన ఆరోపణలు గుప్పింది.

జియో ఫ్రీ ఆఫర్ల వల్లే

ముకేష్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాలపాలైందని, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆరోపించింది.

టెలికాం కంపెనీల నష్టాలకు

కస్టమర్లను ఆకట్టుకునేందుకు, మార్కెట్‌ షేర్‌ పెంచుకునేందుకు జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది. దేశీయ టెలికాం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్‌కాం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆరోపించింది.

అప్పుల ఊబిలో

అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్‌కాం జియోపై పలు ఆరోపణలు గుప్పించింది. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో కారణంగానే టెలికాం కంపెనీలో భారీగా నష్టపోయాయని ఆర్‌కాం ఆరోపించింది.

రుణ సేవల సామర్థ్యాలు

రిత్రలో మొట్టమొదటిసారిగా టెలికాం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా, టెలికాం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Anil Ambani's RCom Blames 'New Operator' For Telecom Sector's Problems Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting