Home
News

అనిల్ అంబానీ రేడియో అమ్మకం ధర తెలిస్తే నోరెళ్లబెట్టాలసిందే !

అప్పుల ఊబిలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ​(ఆర్‌కాం)ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ర్‌

అప్పుల ఊబిలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ​(ఆర్‌కాం)ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ (ఆర్‌బీఎన్) రేడియో బిజినెస్‌ను విక్రయించేందుకు నిర్ణయించుకున్నారంటూ తాజాగా పలు నివేదికలు మార్కెట్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అనిల్ అంబానీ రేడియో అమ్మకం ధర తెలిస్తే నోరెళ్లబెట్టాలసిందే !

అనిల్ అంబానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో వీటి నుంచి గట్టెక్కడానికి తన కంపెనీల్లో వాటాలను మెల్ల మెల్లగా విక్రయిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే మరో అడుగు ముందుకేసి బిగ్‌ ఎఫ్‌ఎంను విక్రయించనున్నారు.

దైనిక్ జాగరన్

దైనిక్ జాగరన్

రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్‌ ఎఫ్‌ఎంను విక్రయించనుంది. హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్‌ జాగరన్‌ చీఫ్ ఎడిటర్, జాగరన్ ప్రకాశన్‌ కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ రూ.1200 కోట్లకు దీన్ని దక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. పూర్తి నగదు రూపంలో ఈ డీల్‌ ఉండబోతోంది. ఇందుకు సంబంధించిన లావాదేవీలు మొత్తం ఫస్ట్ క్వార్టర్‌లో పూర్తి కానుంది.

12 వేల కోట్ల రూపాయల అప్పులు

12 వేల కోట్ల రూపాయల అప్పులు

దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 12 వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చే క్రమంలో అంబానీకి ఈ విక్రయం భారీ ఊరటనిస్తుందని అంచనా. అయితే దీనిపై రిలయన్స్‌ గ్రూపునుంచి గానీ, ఇటు జాగరన్ ప్రకాశన్‌ నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా నివేదికల ప్రకారం మొదట 24 శాతం వాటాను ఎంబీఎల్‌ సొంతం చేసుకుంటుంది. దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడేళ్లు ముగియకుండా మేజర్‌ వాటాను విక్రయించడానికి అనుమతి లేదు.

59 రేడియో స్టేషన్లు

59 రేడియో స్టేషన్లు

బిగ్ ఎఫ్‌ఎంలో 59 రేడియో స్టేషన్లు ఉన్నాయి. మార్చి 31, 2018 నాటికి బిగ్ ఎఫ్‌ఎం 45 స్టేషన్లకు లాక్-ఇన్ పీరియడ్‌ ముగిసింది, అయితే మిగిలిన 14 స్టేషన్లకు 2020 మార్చిలో గడువు ముగుస్తుంది. దీని ప్రకారం మిగిలిన 14 స్టేషన్లు, 2020 లో వారి లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత బదిలీ అవుతాయి.

రేడియో సిటీ బ్రాండ్ క్రింద 39 స్టేషన్లు,
జాగరన్ ప్రకాశన్‌కు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌( ఎంబీఎల్‌) రేడియో సిటీ పేరుతో ఎఫ్‌ఎం చానల్‌ నిర్వహిస్తోంది. ఎంబీఎల్‌ రేడియో సిటీ బ్రాండ్ క్రింద 39 స్టేషన్లు ఉన్నాయి. ఈడీల్‌ ముగిసిన అనంతరం దేశంలోనే అదిపెద్ద ఎఫ్‌ఎం స్టేషన్‌ బ్రాండ్‌గా ఎంబీఎల్‌ అవతరించనుంది. కాగా ప్రభుత్వ అనుమతి లభించని కారణంగా ఈ బిజినెస్‌ అమ్మకానికి సంబంధించి జీ గ్రూపుతో ఒప్పందానికి గతంలో బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే.

 

నిప్పన్‌ లైఫ్‌

నిప్పన్‌ లైఫ్‌

ఇకపోతే మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్‌ కుదుర్చుకుంది. నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్‌ క్యాపిటల్‌కు రూ.6,000 కోట్లు సమకూరతాయి. ఇతర మోనిటైజేషన్స్ ప్లాన్స్‌తో రిలయన్స్ క్యాపిటల్ స్టేక్ విక్రయం వల్ల రూ.12,000 కోట్ల రుణభారం తగ్గుతుందని రిలయన్స్ క్యాపిటల్ సీఎఫ్ఓ అమిత్ బాప్నా తెలిపారు. అంటే 70 శాతం రుణభారం తగ్గనుంది.

ఆర్‌కామ్ నష్టం రూ.7,767 కోట్లు

ఆర్‌కామ్ నష్టం రూ.7,767 కోట్లు

ఇదిలా ఉండగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నష్టాల పరంపర కొనసాగుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.7,767 కోట్ల నష్టం చవిచూసినట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది. 2017-18 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.19,776 కోట్ల నష్టంతో పోలిస్తే తగ్గింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ.976 కోట్ల నుంచి రూ.1,089 కోట్లకు ఎగబాకింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Anil Ambani to sell BIG FM for Rs 1,050 cr to Jagran's Music Broadcast
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X